డియర్‌ కామ్రేడ్‌ బాధితులకు నష్టపరిహారం ఇచ్చారట  

Mythri Movie Makers Help Tobuying Dear Comrade Movie Buyers-mythri Movie Makers,rashmikha Mandhanna

విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.విజయ్‌ దేవరకొండపై ఉన్న నమ్మకంతో బయ్యర్లు ఈ చిత్రంను భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది.తీరా సినిమా కలెక్షన్స్‌ చూస్తే బయ్యర్లు బలి అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు.అంతా అనుకున్నట్లుగానే బయ్యర్లు దాదాపు 40 నుండి 60 శాతం వరకు నష్టపోయినట్లుగా సమాచారం అందుతోంది.

Mythri Movie Makers Help Tobuying Dear Comrade Movie Buyers-mythri Movie Makers,rashmikha Mandhanna-Mythri Movie Makers Help ToBuying Dear Comrade Buyers-Mythri Rashmikha Mandhanna

మైత్రి మూవీస్‌ వారు నష్టపోయిన బయ్యర్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.మొదట్లో ఒప్పందం ఏమీ లేకున్నా కూడా బయ్యర్లు నష్టపోయిన మొత్తంలో 50 శాతం వరకు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందిగా మైత్రి మూవీస్‌ వారు నిర్ణయించుకున్నారు.తాజాగా బయ్యర్లతో వారు సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

బయ్యర్లు ఏమాత్రం బాధ పడకుండా నష్టాల్లో సగం వరకు ఇవ్వడంతో మైత్రి మూవీస్‌ తన మంచి మనసును చాటుకోవడంతో పాటు ఇతర నిర్మాతలకు ఆదర్శంగా నిలవడం జరిగింది.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రంకు భరత్‌ కమ్మ దర్శకత్వం వహించాడు.కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళంలో అంటే మొత్తం సౌత్‌ ఇండియా మొత్తం విడుదలైంది.అన్ని చోట్ల కూడా ఈ చిత్రంకు దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.

ఈ చిత్రం దెబ్బతో విజయ్‌ దేవరకొండ కాస్త సీరియస్‌గా సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.కథ మరియు కథనం విషయాల్లో పట్టు ఉన్న దర్శకుడి కోసం విజయ్‌ దేవరకొండ అన్వేషిస్తున్నాడు.

Mythri Movie Makers Help Tobuying Dear Comrade Movie Buyers-mythri Movie Makers,rashmikha Mandhanna-Mythri Movie Makers Help ToBuying Dear Comrade Buyers-Mythri Rashmikha Mandhanna