నదులలో చిల్లర పైసలు మరియు పండ్లు ఎందుకు వేస్తారో తెలుసా ?  

Myth Of Throwing Coins In Water-

సాధారణంగా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా నది మీదుగా బస్సులో గాని రైలులో గాని ప్రయాణం చేస్తున్నప్పుడు చిల్లర డబ్బులు లేదా పండ్లు వేసి నమస్కరించటం తరచుగా చూస్తూనే ఉంటాం.ఈ ఆచారం మన పూర్వీకుల నుంచి వచ్చింది.జీవరాశికి ఆకలి దప్పులు తీర్చే నదులను దేవతలుగా భావించి ఆరాధించడం మన సంప్రదాయం.

Myth Of Throwing Coins In Water--Myth Of Throwing Coins In Water-

ఈ కారణంగానే నదీమ తల్లికి కానుకలుగా చిల్లర డబ్బులు … నైవేద్యంగా పండ్లు సమర్పిస్తూ వుంటారు.ఇక ఈ ఆచారం వెనుక మరో ప్రయోజనం కూడా ఉంది.పూర్వం ‘రాగి’ పైసలు చెలామణిలో ఉండేవి.రాగి కలిసిన కారణంగా నీరు మరింత శుద్ధం అవుతుంది.ఆ నీరు తాగడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఇక పండ్లను నదికి సమర్పించడమంటే … ఆ నదిలోని జీవరాశికి ఆహారాన్ని అందించడమే.నీటిలోని జీవులు నేలపైకి రాలేవు.ఆ నీటిలో వాటికి సరిపడేంత ఆహారం దొరక్కపోవచ్చు.ఈ కారణంగా మానవత్వంతో వాటికి ఆహారాన్ని అందించాలనే మంచి ఉద్దేశమే మనకి కనిపిస్తుంది.

Myth Of Throwing Coins In Water--Myth Of Throwing Coins In Water-

ఇలా మన పెద్దవారు పెట్టిన ఆచారాల వెనక ఆరోగ్యం మరియు మంచి ఉద్దేశం కూడా దాగి ఉంది.