శివుడు పుట్టుక వెనుక రహస్యం ఏంటో తెలుసా?

అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది.ప్రతి తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుతుంది.

 Story Of Lord Shiva And His Mother Bojj Mahadevi, Lord Shiva Mother, Shiva Birth-TeluguStop.com

అయితే ఇక్కడ ఒక అమ్మ భగవంతునికే తల్లిగా మారి ఎలాంటి ప్రేమానురాగాలు చూపించిందో తెలుసుకుందాం.అభవుడైన శివుని చూసి ఒక అమ్మ ఆలోచనలో పడింది శివుడు ఎలా పుట్టాడు? శివుడికి పుట్టుక లేదా అన్న ఆలోచనలో పడింది ఇంతకీ ఆమె ఎవరో కాదు సాక్షాత్తు ముత్తవ్వ గా పిలవబడే బొజ్జ మహాదేవి.
బొజ్జ మహాదేవి అభవుడైన ఆ పరమేశ్వరుడిని చేరదీసి అతనికి తల్లిలా మారింది.తల్లి చూపించే అమితమైన ప్రేమానురాగాలను బాల పరమేశ్వరుడు మీద చూపించింది. తల్లి లేని శివునికి తానే తల్లి లా మారి సపర్యలు చేసింది.శిశువుగా ఉన్న శివుడికి నీళ్లు పోయడం దగ్గర్నుంచి అన్ని తానై చూసుకునేది.

ఆ శివుడికి స్నానమాచరించేటప్పుడు ముక్కు, కళ్ళు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది.శివుని మీద పక్షుల నీడ పడకుండా ఎంతో జాగ్రత్త వహించేది.

బాల శివుని తన పొట్ట మీద పడుకో బెట్టుకుని జోల పాడి నిద్రపుచ్చేది.ఇంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మకు ముగ్ధుడైపోతాడు పరమశివుడు.

అయితే కైలాస నాధుని లాలించిన అమ్మను అనుగ్రహించే ముందు పరీక్ష పెట్టాలనుకున్నాడు.కావాలనే తన అంగలికి ముల్లు రోగం తెచ్చుకొని విల విల లాడిపోయేవాడు.తల్లి పాలు త్రాగడానికి కూడా నోరు తెరవడం లేదు.ఇది చూసి ఆ తల్లి మనసు విలవిలలాడి పోయింది.

ఉన్న ఒక్కగానొక్క కొడుకును వదిలి నేను జీవించలేను అని ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకొని తల నరుక్కొనే సమయంలో ఆ తల్లి ప్రేమను చూసి ముగ్ధుడై పోయిన బోలా శంకరుడు ప్రత్యక్షమై తల్లీ నీ ప్రేమకు పరీక్ష పెట్టి నేను ఓడిపోయాను.

ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా, నాకేం తక్కువ నాయనా మీకు ఎలాంటి కష్టం అనారోగ్య సమస్యలు లేకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉంటే చాలు అని అన్నది.

నీలాంటి తల్లి ఏ బిడ్డ పక్కన ఉన్న వారికి ఎలాంటి రోగాలు ఉండవని అమ్మను దగ్గరకు చేర్చుకున్నాడు.మూడు లోకాలకు తండ్రి అయిన నాకే నువ్వు తల్లివి అయ్యావు గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చందుతావని ఆమెకు వరమిచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube