పానీపూరి కోసం వెళ్లి శవాలుగా మారారు.. మిస్టరీ ఏంటంటే?  

mystery behind mother children death in vizianagaram district Panipuri, Vizayanagaram, Women And Children Death Mystery, Lorry Driver - Telugu Death Mystery, Mother Children Death, Panipuri, Vizianagaram

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.పానీపూరీ కోసం వెళ్లిన తల్లి ఇద్దరు కూతుళ్లు దూకి శవాలుగా తేలారు.

TeluguStop.com - Mystery Behind Mother Children Death In Vizianagaram District

పానీపూరీ కోసం అని చెప్పి బయటకు వెళ్లిన భార్య, ఇద్దరు కూతుళ్లు విగత జీవులుగా కనిపించడంతో భర్త కన్నీరుమున్నీరవుతున్నాడు.అయితే ఎటువంటి గొడవలు, పొరపచ్చాలు లేని కుటుంబం కావడంతొ తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక ఎవరైనా హత్య చేశారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తివివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి 20 ఏళ్ల క్రితం శ్రీనివాసరాజు కుటుంబం వలస వచ్చింది.తొమ్మిదేళ్ల క్రితం శ్రీనివాసరాజుకు గౌరి అనే యువతితో వివాహం జరిగింది.

TeluguStop.com - పానీపూరి కోసం వెళ్లి శవాలుగా మారారు.. మిస్టరీ ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

వీరికి సంకీర్తన, శ్రీ హాసిని సంతానం.ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఇతర జంటలకు సైతం వీళ్ల జంట ఆదర్శంగా నిలిచింది.

అయితే రెండు రోజుల క్రితం సాయంత్రం పిల్లలు పానీపూరీ, తిను బండారాలు అడగటంతో వాటిని కొనిస్తానని గౌరి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

వృత్తిరిత్యా లారీడ్రైవర్ గా పని చేసే శ్రీనివాసరాజు భార్య, పిల్లలు ఎంత సమయమైనా ఇంటికి రాకపోవడంతో వారి కోసం వెతికాడు.

అయితే ఎంతసేపు వెతికినా వాళ్ల ఆచూకీ తెలియలేదు.మరుసటి రోజు ఉదయం నరపాం ప్రాంతంలో ఉన్న చెరువులో గౌరి, ఇద్దరు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గౌరి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మహిళ మృతి మిస్టరీగా మారింది.పోలీసులకు సైతం మహిళ చనిపోవడానికి గల కారణాలు అంతుచిక్కటం లేదు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.గౌరి, ఆమె పిల్లలు చనిపోవడంతో ఆమె తల్లి, అన్నయ్య శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటన వల్ల స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

#Death Mystery #Panipuri #MotherChildren #Vizianagaram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mystery Behind Mother Children Death In Vizianagaram District Related Telugu News,Photos/Pics,Images..