Area 51 Alien : అమెరికా ఓ ఏలియన్ గ్రూప్ ని కిడ్నాప్‌ చేసిందట తెలుసా?

ఆశ్చర్యంగా వుందా? అదేంటో మరి! వింత వింత విశేషాలన్నీ అమెరికాలోనే జరుగుతాయి.ఈ భూగ్రహం దాటి ఇతర గ్రహాలపై ఏలియన్స్ నివసిస్తున్నాయని ఒక ఊహ.

 Mystery Behind Area 51 And Aliens,area 51,aliens,america,donald Trump,area 51 Fa-TeluguStop.com

అది సృష్టించింది మరెవరోకాదు వారే.మనిషిని పోలిన మనిషి ఉంటాడన్న విషయం ఒకసారి పక్కన పెడితే.

ఇతర గ్రహాలపై అసలు జీవం అనే ఉందా అన్నదే పెద్ద సందేహం.ఓ వైపు ఈ ఏలియన్స్ వుండే ఉంటాయి అన్నది ఓ వర్గం వాదన.

గత కొన్ని దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న పెద్ద ప్రశ్న ఏలియన్! అవును, ఈ భూమిపై ఎన్నో ఏళ్లుగా గ్రహాంతరవాసుల అన్వేషణ కొనసాగుతునే ఉంది.భూగ్రహంపై మనుషులు ఎలా అయితే జీవిస్తున్నారో ఇతర గ్రహాలపైనా ఎవరో ఒకరు ఉంటారనే సందేహం శాస్త్రవేత్తల్లో బలంగా ఉంది.

అమెరికా అభివృద్ధి పధంలో దూసుకువెళ్లేందుకు ఏలియన్స్‌ సహకరిస్తున్నాయని అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి.మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏలియన్స్‌తో చాలా సందర్భాల్లో మాటామంతీ కలిపాడని, ఆ గ్రహాంతర వాసులతో అతగాడికి మంచి ఫ్రెండ్‌షిప్‌ కూడా ఉందన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.

అమెరికాలో ఉన్న అత్యంత రిస్ట్రిక్టెడ్‌ ఏరియా అయినటువంటి ఏరియా 51లో ఏలియన్స్‌ ఉన్నాయని చెబుతూ వుంటారు.అక్కడ నుంచే ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశాల వీక్‌నెస్‌ పాయింట్స్‌ను ఏలియన్స్‌ ద్వారా అమెరికా తెలుసుకుంటుందన్న టాక్‌ కూడా ఉంది.

Telugu Aliens, America, Area, Donald Trump, Earth, Mysteryarea, Space-Latest New

అయితే, వాస్తవానికి ఏరియా 51లో ఏం ఉంది? అనే విషయం ఎవరికీ తెలియదు.ఇక ఏలియన్స్‌ సైన్స్‌కు మాత్రమే కాదు గొప్ప గొప్ప సైంటిస్టులకు సైతం అంతుచిక్కని విషయం.ఎందుకంటే.దశాబ్దాల కాలంగా ఏలియన్స్‌ జాడను కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నప్పటికీ, ఏలియన్స్‌ గురించి ఏ ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోవడం కొసమెరుపు.కేవలం భూమిపై నుంచి మాత్రమే కాదు, స్పేస్‌లో కూడా ఏలియన్స్‌ గురించి పరిశోధనలు చేసి విఫలమైన దేశాలు అనేకం ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube