అమెరికా లో 'మిస్టీరియస్ సిండ్రోమ్', చిన్నారులే ఎక్కువగా

కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే.ఒకపక్క కరోనా మరణాలతో అతలాకుతలం అవుతున్న అమెరికా లో ఇప్పుడు మరో వ్యాధి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

 America, Corona Virus, Children, Parents, Mysterious Syndrome, Scientists, Franc-TeluguStop.com

ఈ వైరస్ ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తుండడం ఒక విషయం అయితే కరోనా వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన చిన్నారుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం గమనార్హం.కరోనా మహమ్మారి నుంచి 2 నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు వైరస్ బారి నుంచి ఎలాగో తప్పించుకున్నారు అని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా అంతుచిక్కని ఈ కొత్త వ్యాధి చిన్నారుల్లో కనిపిస్తుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది.

అసలు ఈ వ్యాధి ఏంటి?కరోనా కు సంబంధించిందా లేదంటే మరేదైనా వ్యాధా అని నిపుణులు ఆలోచనలో పడ్డారు.దీనితో ప్రస్తుతం ఈ వ్యాధిని మిస్టీరియస్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు.

వీరిలో రక్తనాళాల్లో వాపు, పొత్తికడుపులో నొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.కరోనా ఉన్న వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కరోనాకు సంబంధించిన వ్యాధిగానే నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఈ సమస్య ఒక్క అమెరికా లోనే కాదు ప్రాన్స్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, బెల్జియం వంటి నగరాల్లోని చిన్నారులు కూడా దాదాపు ఇలాంటి లక్షణాలతోనే వస్తున్నారని తెలుస్తుంది.

అసలు ఈ సమస్య అనేది కరోనాకు సంబంధించిందేనా?లేదంటే మరేదైనా వ్యాధి కారణంగా ఇలా జరుగుతుందా అని నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు.అయితే ఇప్పటికే దీనిపై శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు.ఈ వ్యాధి ని మెదట్లోనే అరికట్టకుంటే అదుపు చేయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube