ఇంటి ముందు తిరుగుతున్న వింత ఆకారం.. వీడియో వైరల్ !

మనం అప్పుడప్పుడు కొన్ని వింత ఆకారాలు చూసి భయపడుతూ ఉంటాం.అలాంటివి చూసినప్పుడు దెయ్యాలు అనుకుని హడలి పోతాం.

 Mysterious Shadowy Figure Filmed In Her Surveillance Camera-TeluguStop.com

కానీ ఇలాంటివి కొంత మంది నమ్మరు.కొట్టి పారేస్తూ ఉంటారు.

అయితే మరి కొంత మంది మాత్రం దేవుడు ఉన్నదనేది ఎంత నిజమో దెయ్యం ఉన్నదనేది కూడా అంతే నిజం అని నమ్ముతూ ఉంటారు.దేవుడిపై అపారమైన భక్తి ఉన్నవారు దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయని నమ్ముతారు.

 Mysterious Shadowy Figure Filmed In Her Surveillance Camera-ఇంటి ముందు తిరుగుతున్న వింత ఆకారం.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీటిని చాలా మంది కొట్టి పారేస్తారు.కానీ కొన్ని వీడియోలు చుస్తే నిజంగా దెయ్యాలు ఉన్నాయనే అనుమానం రాక మానదు.ఈ మధ్య సీసీ టివి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు వీడియోలు రూపంలో బయటకు వస్తున్నాయి.వాటిని చూసి కొంతమంది నిజంగా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయినా కొద్దీ గంటల్లోనే వైరల్ అయ్యింది.

ఇంతకీ అందులో ఏముందా అని అనుకుంటున్నారా.

ఆ వీడియోలో వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి.ఈ ఘటన స్కాట్ల్యాండ్ లో జరిగింది.

అక్కడ నివసిస్తున్న మాక్సిన్ అనే మహిళ ఆమె ఇంట్లో ఉన్న సీసీ టివి దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది.అందులో ఏవో వింత ఆకారాలు కనిపిస్తున్నాయి.

ఆమె బయపడి వెంటనే మతాధికారిని కలిసింది.

ఆమె ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆకారాలు చూశానని చెబుతుంది.

వాళ్ళ పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు ఆ నీడ వారి చుట్టూ తిరుగిందని ఆమె తెలిపింది.ఆమె భర్త కూడా ఒక రోజు రాత్రి వింత ఆకారాన్ని చూశాడని ఆమె తెలిపింది.

ఈ విషయం గురించి ఆమె సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది.ఇంట్లో ఎమన్నా ప్రతికూల శక్తులు ఉన్నాయేమోనని మతాధికారిని కలిశామని ఆమె తెలిపింది.

#ShadowyFigure #StrangeShadow #Glasgow #Barrowfield #Ghost Camera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు