వామ్మో.. ఈ పని గ్రహాంతరవాసులే చేశారా?  

గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలియదు.ఈ భూమి మీద లాగా ఈ విశ్వంలో ఎక్కడో గ్రహం మీద కొన్ని ప్రాణులు జీవించి ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైన వారని చెబుతుంటారు.

TeluguStop.com - Mysterious Metal Tower Found In Red Rock Desert In America

ఇలాంటి వారిని గ్రహాంతరవాసుల అని అంటారు.ఈ గ్రహాంతర వాసులు అప్పుడప్పుడు భూమిపైకి వస్తుంటారని కొంతమంది నమ్ముతుంటారు.

అయితే ప్రస్తుతం అమెరికాలో చోటు చేసుకున్న సంఘటనకు గ్రహాంతర వాసులకు సంబంధం ఉందని అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు.అమెరికాలో జరిగిన సంఘటన గురించి ఇక్కడ తెలుసుకుందాం…

TeluguStop.com - వామ్మో.. ఈ పని గ్రహాంతరవాసులే చేశారా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అమెరికా లోని యుటాలోని ప్రాంతంలో ఉన్న రెడ్ రాక్ ఎడారి ప్రాంతంలో ఉన్నఫలంగా ఒక లోహ శిల ఏర్పడింది.

ప్రస్తుతం దీని గురించి అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఒక మారుమూల ప్రాంతంలో ఏర్పడి ఉన్న ఎడారి ప్రాంతంలో కి ఎవరూ వచ్చి ఈ శిలా పాతి పెట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ లోహపు శిలను తాజాగా వన్యప్రాణి విభాగ సిబ్బంది ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు.

పెద్ద కొమ్ములు ఉన్న గొర్రెలను లెక్కించడానికి వన్యప్రాణి విభాగ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా సర్వే చేయడానికి బయలుదేరారు.ఈ సర్వే నేపథ్యంలో ని వారికి రెడ్ ఎడారి ప్రాంతంలో మెరుస్తూ ఉన్నటువంటి ఒక లోహపు శిల వారి కంట పడింది.అయితే హెలికాఫ్టర్ నుంచి అక్కడికి చేరుకొని దానిని పరిశీలించారు.

అంగారకుడి వాతావరణాన్ని పోలి ఉండే ఎరుపురాతి ఎడారిలో స్టీల్‌ మాదిరి ఏకశిల ఇద్దరి మనుషుల ఎత్తులో ఉన్నటువంటి ఈ స్టెయిన్ లెస్ స్టీల్ స్తంభం వంటి నిర్మాణాన్ని భూమిలో పాతి పెట్టారు.

నవంబర్ 18న స్తంభాన్ని గుర్తించిన అధికారులు భద్రతా దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

జాతీయ ప్రభుత్వ స్థలంలో ఇలాంటివి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది.ఈ విషయం బయటకు తెలిస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు శాస్త్రవేత్తలు ఇక్కడికి చేరుకొని ఎడారిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉండటం వల్ల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

ఈ విషయంపై దర్యాప్తు చేయాలా వద్దా అన్న నిర్ణయం కేవలం బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అధికారులు నిర్ణయిస్తారు.ఈ ఘటనపై కొందరు గ్రహాంతరవాసులు ఉంటారని నమ్మేవారు, ఈ పని గ్రహాంతర వాసులే చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ పని ఎవరు చేశారు అన్న దానిపై దర్యాప్తులో తేలాల్సి ఉంది.

#BureauOf #MysteriousMetal #Red Rock Desert #Aliens #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు