ఈసారి భారత్ లో కనబడిన మిస్టరీ రాయి..!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్‌ రాయి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రత్యక్షమైంది.అది ఎక్కడంటే గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద ‘మిస్టీరియస్‌ మోనోలిత్‌’ దర్శనం ఇచ్చింది.

 Mystery Stone Found In Gujarat, Mystery Stone, Ahmedabad, Gujarat, Social Media,-TeluguStop.com

ఇది దాదాపు 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది.మన భారతదేశంలో ఇటువంటి ఏకశిలా ఏర్పడిన, చూసిన మొదటి ప్రాంతం ఇదే అవ్వడం విశేషం.

అసలు వివరాల్లోకి వెళితే.

అహ్మదాబాద్‌ లోని తల్తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్ వద్ద ఈ ఏకశిలా కనిపించింది.

దీనిని సాధారణంగా స్థానికులు ‘మిస్టరీ మోనోలిత్’ అని పిలుస్తారు.అంటే ఒకలోహంతో చేసిన నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపించడం దీని విశేషం.

ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.దీనిని తవ్విపెట్టినట్లుగా ఎటువంటి సంకేతాలు అనేవి దాని బేస్ వద్ద కనిపించకపోవడం మరో విశేషం.

అక్కడ ఉండే పార్క్ తోటమాలి ఆసారామ్ అక్కడ పార్క్ లోపల ఎవరు కూడా ఆ నిర్మాణాన్ని ఉంచడాన్ని తాను చూడలేదని చెప్పారు.ఆ తోటమాలి “సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు.

కానీ మరుసటి రోజు ఉదయం తిరిగి పార్కులోకి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయానని ఆశారాం తెలిపారు.అది చూసిన వెంటనే గార్డెన్‌ మేనేజర్‌ కు చెప్పగా.

ఆయన కూడా ఆశ్చర్యంతో చూసినట్లుగా ఆశారం పేర్కొన్నారు.

Telugu Ahmadabad, Gujarat, Mistory Stone-Latest News - Telugu

ఈ ఏకశిలా నిర్మాణము ఎలా ఉందంటే త్రిభుజాకారంగా ఉండి, దాని ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఉన్నాయి.అయితే ఆ సంఖ్యలు, చిహ్నాలకు సంబంధించిన విషయాలను కనుగొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ మిస్టీరియస్‌ మోనోలిత్‌ గురించి సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ ప్రదేశం అంతా పర్యాటక ప్రాంతంగా మారింది.

ప్రజలు ఫొటోలు, సెల్ఫీలను తీసుకుని తెగ హడావుడి చేస్తున్నారు.ఈ ఏకశిలా అనేది అమెరికాలోని ఉటా ఎడారిలో తొలుత ప్రత్యక్షమైనట్లు నివేదించబడింది.ఈ నిర్మాణాన్ని చూసిన అహ్మదాబాద్‌ లోని పార్కును అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పీపీపీ మోడ్ కింద ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube