వామ్మో.. ఆకాశం నుండి మనుషులపై ఆ వ్యర్ధాలు..?!

ఆకాశం నుంచి ఏవైనా తోకచుక్కలు పడుతున్నాయనే వార్తలు వినిపిస్తే, ప్రపంచమంతా ఎంతో ఆందోళనతో, ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.ఇక అంతరిక్ష నుంచి ఏవైనా చిన్నపాటి శకలాలు పడినా, వాటి కోసం వివిధ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు రంగంలోకి దిగుతాయి.

 Mysterious Metal Balls Falls From Space In Gujarat Details, Sky, Wastage, Viral-TeluguStop.com

కనిపించిన వాటిని స్వాధీనం చేసుకుని పరిశోధనలు మొదలు పెడతాయి.ఇదే కోవలో గుజరాత్‌లో అంతరిక్షం నుంచి పడిన కొన్ని వ్యర్థాలు దర్శనమిచ్చాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా వ్యాప్తంగా భలేజ్, ఖంభోలాజ్, రాంపూరాలో మూడు చోట్ల అంతరిక్షం నుండి అనుమానిత శిథిలాల శకలాలు పడ్డాయి.

వీటిని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.జిల్లా పోలీసులు ఈ ఘటనను గుర్తించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులను పిలిపించి విచారణ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.గురువారం సాయంత్రం 4.45 గంటలకు, ఐదు కిలోల బరువున్న మొదటి పెద్ద బ్లాక్ మెటల్ బాల్ భలేజ్‌ ప్రాంతంలో పడింది.ఆ తర్వాత ఖంభోలాజ్, రాంపురాలో ప్రాంతాల్లో పడ్డాయి.అన్నీ ఒకదానికొకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

Telugu Forensicscience, Gujarat, Gujaratblalej, Balls Space, Balls, Latest, Wast

దీనిపై ఆనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియాన్ స్పందించారు.మెటల్ బాల్ శాటిలైట్ శిధిలాలుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.శకలాల వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.ఖంభోలాజ్‌లోని ఒక ఇంటిపై శిధిలాలు పడిపోయాయని, మిగిలిన రెండు వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడ్డాయి.ఇవి ఎలాంటి అంతరిక్ష వ్యర్థమో తమకు తెలియదని ఆయన చెప్పారు.అయితే అవి ఆకాశం నుండి పడ్డట్లు గ్రామస్తులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube