3 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న గుర్తు తెలియని మనిషి!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో మనకు తెలిసిపోతుంది.

 Pilots Report Mysterious Man With Jetpack Flying Near Planes, Pilots Report, Mys-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలు, విడ్డూరాలకు సంబంధించిన సమాచారం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.తాజాగా కాలిఫోర్నియాలో విమానం నడుపుతున్న పైలెట్ ఊహించని విధంగా సంభ్రమాశ్చార్యాలకు లోనయ్యాడు.

పైలెట్ గాలిలో వేగంగా 3,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడుపుతున్న సమయంలో ఆ వ్యక్తికి జెట్ ప్యాక్ లో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు.దీంతో పైలెట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

పక్కనే ఉన్న మరో పైలెట్ కు జెట్ ప్యాక్ లో ఆ వ్యక్తి కనిపించడంతో ఏం చేయాలో పాలుపోని పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు తెలిపారు.యూఎస్ లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ఘటన ఫిక్షన్ , యాక్షన్ సినిమాలను పైలెట్లకు గుర్తుకు తెచ్చింది.

అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్లు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ అధికారులకు ఆడియో లాగ్ ద్వారా సమాచారం ఇచ్చారు.ఆ వ్యక్తి 3,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానానికి కేవలం 300 మీటర్ల దూరం ఉన్నట్లు తాము గుర్తించామని పైలెట్ తెలిపాడు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్

సైతం గాలిలో మనిషి ఎగురుతున్న విషయాన్ని ధృవీకరించింది.అధికారులు ఆ వ్యక్తి ఆన్ లైన్ లో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం గాలిలో విన్యాసాలను చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube