మిచిగాన్‌ సరస్సులో బయటపడిన మిస్టీరియస్ ఘోస్ట్ షిప్: 128 ఏళ్ల క్రితం అదృశ్యం  

Mysterious Ghost Ship Discovered In Lake Michigan-lake Michigan,mysterious Ghost Ship,richardson’s Diving

దాదాపు 128 సంవత్సరాల క్రితం మునిగిపోయిన స్కూనర్ శిథిలాలు మిచిగాన్‌ సరస్సులో దొరికాయి.మునిగిపోయిన నౌకలను వెతికే రాస్ రిచర్డ్సన్ మిచిగాన్ సరస్సులోని సౌత్ మానిటౌ ద్వీపం మీదుగా వెళుతుండగా అతని సోనార్ (నీటి అడుగు భాగంలో వున్న వస్తువుల జాడను కనుగొనే ఒక సౌండ్ పరికరం) కు ఒక వింత శబ్ధం వచ్చింది.దీనిని రిచర్డ్సన్ రికార్డు చేసి విశ్లేషించిన ఆయన తిరిగి వారం తర్వాత మిచిగాన్ సరస్సు వద్దకు తిరిగొచ్చారు.

Mysterious Ghost Ship Discovered In Lake Michigan-lake Michigan,mysterious Ghost Ship,richardson’s Diving Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్-Mysterious Ghost Ship Discovered In Lake Michigan-Lake Michigan Mysterious Richardson’s Diving

మరోసారి సోనార్‌ను ఉపయోగించగా ఈసారి సరస్సు లోపలినుంచి 90 అడుగుల దూరంలో ఏదో వస్తువు ఉన్నట్లుగా చూపించింది.300 అడుగుల లోతున్న మిచిగాన్ సరస్సు అడుగుభాగానికి తాను వెళ్లడం అసాధ్యమని భావించిన రిచర్డ్సన్.తన స్నేహితుడు డైవింగ్ మరియు అండర్ వాటర్ ఫోటోగ్రాఫింగ్‌లో నిపుణుడైన స్టీవ్ వైమర్‌ను పిలిపించాడు.

Mysterious Ghost Ship Discovered In Lake Michigan-lake Michigan,mysterious Ghost Ship,richardson’s Diving Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్-Mysterious Ghost Ship Discovered In Lake Michigan-Lake Michigan Mysterious Richardson’s Diving

సెప్టెంబర్ 30న రిచర్డ్సన్, వైమర్ మరో మిత్రుడు బ్రెంట్ టాంప్కిన్స్‌ సదరు ప్రదేశానికి వచ్చారు.

వైమర్ సరస్సు అడుగుకి డైవింగ్ చేసుకుంటూ వెళ్లి సదరు పడవను ఫోటో తీసి దానికి ‘‘ మిస్టీరియస్ ఘోస్ట్ షిప్’’గా పేరు పెట్టాడు.ఎందుకంటే తాను ఇప్పటి వరకు కనుగొన్న పడవ శిథిలాల్లో చెక్కు చెదరకుండా ఉన్నది ఇదేనని వైమర్ పేర్కొన్నాడు.

సదరు పడవ 60 నుంచి 70 అడుగుల పొడవుందని అతను తెలిపాడు.ఈ ఫుటేజ్‌ను రిచర్డ్సన్ బృందం యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

పడవ యొక్క మాస్ట్‌లు, డెక్, హల్, క్యాబిన్, లైఫ్ బోటు కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.పాట్రిక్ లాబాడీ గ్రేట్ లేక్స్ మారిటైమ్ రికార్డులు, పాత వార్తాపత్రికల కథనాలను బట్టి ఈ ఓడను డబ్ల్యూ సీ కిమ్‌బాల్‌గా తెలుస్తోంది.

1891 మేలో ఇది ఉప్పు, కలప లోడును తీసుకువెళుతూ అదృశ్యమైంది.అందులో అప్పుడు నలుగురు సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది.దీనిని 1888లో విస్‌‌కు చెందిన మానిటో‌వాక్ నిర్మించింది.