శిరస్సు లేని దేవి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

సాధారణంగా మనం ఇప్పటివరకు అష్టాదశ శక్తి పీఠాల గురించి ఎన్నో విన్నాము.ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాలు మన దేశంలో పలు ప్రాంతాలలో కొలువై ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే.

 Mysteries Of Chin Mastika Devi Dham Temple, Chintapurni Temple, Mastika Devi, Ka-TeluguStop.com

ఈ ప్రాంతాలలో వెలిసిన అమ్మవారు ఎంతో మహిమ కలిగి భక్తుల కోరికలను నెరవేర్చే విశేష పూజలు అందుకుంటున్నారు.అయితే ఎక్కడైనా మనకు అమ్మవారు తల భాగం తప్పకుండా దర్శనమిస్తుంది.

ఎప్పుడైనా శిరస్సు లేకుండా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారిని చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఈ విధంగా శిరస్సు లేకుండా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు ఎక్కడ ఉన్నారు? ఈ విధంగా తల లేక పోవడానికి గల కారణాలు ఏమిటి? అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖమైన శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం.ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ అమ్మవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు.ఈ శక్తి పీఠములు పరాశక్తి తన భర్త అయిన కాలభైరవుడితో తోడుగా కొలువై ఉంటుంది.

చింతపూర్ణి అంటే ఆ పార్వతీ దేవిని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీరంలోని పాదాలు ఈ చింతపూర్ణిలో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ ఆలయంలో అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా పిండి రూపంలో ఉండటం విశేషం.

ఈ అమ్మవారిని భక్తిభావంతో పోలిస్తే తమ కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల విశేష నమ్మకం.

అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు శిరస్సు లేకుండా కొలువై ఉండటం వల్ల చిన్ మస్తికాదేవిగా పిలుస్తారు.

చిన్ అంటే లేదు.మస్తికా అంటే శిరస్సు.

శిరస్సు లేని అమ్మవారు అని అర్థం.మార్కండేయ పురాణం ప్రకారం చండీ దేవికి, అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో చండి దేవి రాక్షసులను సంహరిస్తుంది.

ఈ యుద్ధంలో అమ్మవారికి సహాయం చేసిన ఢాకిని, యోగినిగా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని సంహరించి వారి రక్తాన్ని తాగుతారు. యుద్ధం తర్వాత కూడా వారు రక్త దాహం తో ఉండటంతో వారి దాహాన్ని తీర్చడం కోసం చండీ దేవి స్వయంగా తన శిరస్సును ఖండించుకొని తన శరీరం నుంచి వచ్చే రక్తం ద్వారా వారి రక్తదాహాన్ని తీర్చింది.

అందుకే ఇక్కడ అమ్మవారిని చిన్ మస్తిక దేవి అని పిలుస్తారు.అదేవిధంగా పురాణాల ప్రకారం ఆ రుద్ర దేవుడు ఈ ప్రదేశాన్ని నలుదిక్కులా కాపాడుతుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube