బాలమేధావి కరోనా వైరస్ పై కాలజ్ఞానం... మే నెల వరకు ఇంతే

ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త విషయం.వింత చోటు చేసుకుంటే దానిని బ్రహ్మం గారి కాలజ్ఞానం కి ముడిపెట్టేయడం జరుగుతూ ఉంటుంది.

 Mysore Wonder Boy Prediction About Pandemic Corona Virus, Covid-19, Corona Effec-TeluguStop.com

అలాగే ఇప్పుడు కరోనా వైరస్ గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని ప్రచారం విస్తృతం అయ్యింది.అలాగే కరోనా వైరస్ గురించి రాయబడిన కాల్పనిక నవలలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడో పదేళ్ళ క్రితమే ఈ నవలలో రచయిత ముందే గ్రహించి జరగబోయే విపత్తు గురించి రాసాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే దారిలో ఓ బాల మేధావి వచ్చాడు.

మైసూరుకి చెందిన ఈ బాలమేధావి పేరు అభిజ్ఞా ఆనంద్.గత కొద్ది రోజులుగా ఈ పేరు ప్రముఖ మీడియా చానల్స్ లోను, అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.

దీనికి కారణం ఈ బుడతడు ఆరు నెలలు ముందుగానే 2020లో బయోలాజికల్ వార్ జరగబోతుంది అని చెప్పడంతో అందులో చైనా ఎక్కువ సఫర్ అవుతుంది అని ప్రస్తావించడంతో ఇతను హైలెట్ అయ్యాడు.

ఏప్రిల్ నెలలో దేశంలో ఒక వైరస్ విజృంభిస్తుంది అని చెప్పాడు.

అతడు చెప్పినట్టుగానే కంట్రోల్ కి వచ్చింది అనుకున్న కరోనా గత రెండు రోజులుగా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది.అభిజ్ఞా ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో 2020 లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బందిపడిపోతుందని మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోతుందని చెప్పాడు.

అప్పుడు ఆ అభిజ్ఞా చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది.ఈ వైరస్ నుండి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి అంటే ప్రస్తుతం ఈ వైరస్ కు బలం చేకూర్చే గ్రహాలు చాలా ఉన్నాయి అని దీని వల్ల ఏప్రిల్ నెల చివరి వరకు ఈ వైరస్ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నాడు.

ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 29 వరకు గడ్డు కాలంగా ఉంటుందని చెప్పాడు.అలాగే ఈ వైరస్ రెండు నెలలపాటు కొనసాగి మే 29 వరకూ పీడించి ఆ తరువాత మనం పూర్తిగా బయటపడడం జరుగుతుందని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube