క‌ర‌క్కాయను ఇలా తీసుకుంటే..వేగంగా బ‌రువు త‌గ్గుతార‌ట‌?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మందిని అధిక బ‌రువు స‌మ‌స్య ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే.బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల లావుగా క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.

 Myrobalan Can Reduce Over Weight Myrobalan-TeluguStop.com

అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా చుట్టు ముట్టేస్తుంటాయి.అందుకే అధిక బ‌రువును నియంత్రించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

ఈ నేప‌థ్యంలో చాలా మంది డైటింగ్లు, వ‌ర్కౌట్లు చేస్తూ.బ‌రువును త‌గ్గించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు.

 Myrobalan Can Reduce Over Weight Myrobalan-క‌ర‌క్కాయను ఇలా తీసుకుంటే..వేగంగా బ‌రువు త‌గ్గుతార‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బ‌రువును కోల్పోయేలా చేయ‌డంలో క‌ర‌క్కాయ కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉన్న క‌ర‌క్కాయను పూర్వ కాలం నుంచి అనేక రోగాలకు నివారిణిగా ఉప‌యోగిస్తున్నారు.

ముఖ్యంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు.ఒక గ్లాస్ ప‌ల్చ‌టి మ‌జ్జిగ‌లో అర స్పూన్‌ క‌ర‌క్కాయ పొడిని క‌లిపి భోజ‌నం చేయ‌డానికి ముందు సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే.ఖ‌చ్చితంగా ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది.

ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

Telugu Benefits Of Myrobalan, Good Health, Health, Health Tips, Karakkaya, Karakkaya For Health, Latest News, Myrobalan, Over Weight, Weight Loss, Weight Loss Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే క‌ర‌క్కాయ‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.మ‌రి లేట్ చేయ‌కుండా వాటిపై కూడా ఓ లుక్కేసేయండి.సాధార‌ణంగా చాలా మంది త‌మ ప‌ళ్ళు తెల్ల‌గా లేవ‌ని ఇబ్బంది ప‌డుతూ ఉంటాయి.

అలాంటి వారు క‌ర‌క్కాయ పొడిలో కొద్ది ఉప్పు చేర్చి.ఆ మిశ్ర‌మంతో దంతాల‌ను తోముకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల బ‌డ‌టంతో పాటు చిగుళ్లు వాపు త‌గ్గి దృఢంగా మార‌తాయి.

Telugu Benefits Of Myrobalan, Good Health, Health, Health Tips, Karakkaya, Karakkaya For Health, Latest News, Myrobalan, Over Weight, Weight Loss, Weight Loss Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలోనూ క‌ర‌క్రాయ ఉప‌యోగ‌ప‌డుతుంది.క‌ర‌క్రాయ‌ను నీటి సాయంతో అర‌గ‌దీసి.ఆ పేస్ట్‌ను నుదుటనపై అప్లై చేసుకోవాలి.

ఇలా చేస్తే క్ష‌ణాల్లోనే త‌ల‌నొప్పి త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ క‌ర‌క్కాయ పొడిని క‌లిపి ప్ర‌తి రోజు సేవిస్తే.

పొడి ద‌గ్గు త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.దాంతో బ్యాక్టీరియాలు, వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

#Karakkaya #Myrobalan #Tips #Karakkaya #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు