ముప్పయ్‌ ఐదు నిమిషాల్లో....

ముప్పయ్‌ ఐదు నిమిషాల్లో ఏం జరిగింది? విచిత్రం జరిగిందా? వింత జరిగిందా? అద్భుత పరిణామం జరిగిందా? ఈ ప్రశ్నలకు ఒక విధంగా ‘అవును’ అని సమాధానం చెప్పవచ్చు.ఈరోజు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అని తెలుసు కదా…! ప్రపంచంలోని నూటయాభైకి పైగా దేశాలు దీన్ని ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్నాయి.

 International Yoga Day: 35 Yoga Asanas In 35 Minutes-TeluguStop.com

ఇది ఎన్నడూ జరగని వింత.భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ కారణంగా ఐక్యరాజ్య సమితి జూన్‌ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం మనకు విజయం.

ఇస్లాం మతం ప్రధానంగా గల అనేక దేశాలు దీన్ని స్వాగతించడం విచిత్రం.ఈ రోజు దేశమంతా యోగా వేడకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో యోగా డే ఉత్సాహంగా నిర్వహించారు.ఇక్కడ ముప్పయ్‌ ఐదు నిమిషాల్లో ముప్పయ్‌ ఐదు యోగాసనాలువేశారు.

కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాణాయామంతోపాటు అనేక మోగాసనాలువేశారు.ధ్యానం చేశారు.

తడాసన, వక్రాసన, భద్రాసన, భుజంగాసన…మొదలైన ఆసనాలు వేశారు.ఇంత పెద్దెత్తున ‘మాస్‌ యోగా’ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.

మొట్టమొదటి అంతర్జాతీయ దినోత్సవం విజయవంతమైందని చెప్పొచ్చు.ప్రపంచానికి మోదీ ఓ కొత్త పండుగను పరిచయం చేశారు.

సనాతన యోగా పట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచారు.ఏదో మొక్కుబడిగా ఈ ఒక్కరోజే యోగాసనాలు వేయకుండా దీన్ని జీవితాంతం కొనసాగిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని యోగా నిపుణులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు