అదిరిపోయే సేవలను పరిచయం చేసిన మింత్రా.. ఇకపై ప్రొడక్ట్స్ వివరాలన్నీ ఆన్‌లైన్‌ లోనే..!

ప్రస్తుతం ఏది కావాలన్నా గాని క్షణాల్లో ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇంటికి రప్పించుకుంటున్నారు.ఈ క్రమంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన ఆన్లైన్ షాపింగ్స్ లో మింత్రా(Myntra) సంస్థ కూడా ఒకటి.

 Myntra Came With Amazing Services Products Details Will Be Available Online Deta-TeluguStop.com

ఆల్ ఇండియా మొత్తం తమ సేవలను విస్తృతంగా విస్తరిస్తోంది.ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ తో, సరికొత్త వస్త్రాలను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఈ క్రమంలోనే మింత్రా ఇప్పుడు ఎం-లైవ్ (M-Live) పేరుతో లైవ్ కామర్స్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించింది.ఈ ఎం-లైవ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నేరుగా లైవ్ లో మీరు ప్రోడక్ట్ ను చూడవచ్చు అన్నమాట.

అంటే మింత్రా లో గల ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు మీకు మింత్రా ఉత్పత్తులను లైవ్‌లో చూపిస్తుంటారు.

మీకు ఆ ప్రొడక్ట్స్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నాగాని వాటికి సమాధానాలు ఇస్తుంటారు.

అంటే మీరు ఒక షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి ఫీల్ పొందుతారన్నమాట.నిజంగానే మీరు షాపింగ్ మాల్ కు వెళ్లి దుస్తుల, బ్యూటీ ఉత్పత్తుల గురించి వారితో మాట్లాడినంత అనుభూతిని మీరు ఈ ఎం-లైవ్ ద్వారా పొందవచ్చు.

అలాగే ఇలా ఎం-లైవ్ ఫ్లాట్‌ఫాంతో లైవ్ షాపింగ్ మోడల్‌ ను ప్రవేశపెట్టిన తొలి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ లలో మింత్రా నిలిచింది.అలాగే ఎం-లైవ్ సాయంతో ఎక్స్‌పర్ట్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు మింత్రా యాప్‌లో వివిధ రకాల ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పవచ్చు అంట.అలాగే వీరు లైవ్ స్ట్రీమింగ్ వీడియో సెషన్‌లను హోస్ట్ చేయడానికి కూడా ఎం-లైవ్ అనుమతిస్తుంది.ముందుగా యూజర్లు మింత్రా యాప్‌ లోని స్టూడియో సెక్షన్ లోకి వెళ్లి లైవ్ ఈవెంట్స్‌లో పాల్గొనాలి అంటే పాల్గొనవచ్చు.

Telugu Latest, Live, Livee, Myntra, Myntracpo, Myntra Live, Launch, Time Product

మీరు కావాలనుకున్న ఉత్పత్తులపై ఎటువంటి క్వశ్చన్లు ఉన్నాగాని మీరు పోస్ట్ చేయవచ్చు.లైవ్ స్క్రీన్ దిగువన కనిపించే ఉత్పత్తిని మీ యొక్క విష్ లిస్ట్ కు యాడ్ చేయడంతో పాటు లైవ్ స్ట్రీమ్ నుంచి బయటకు రాకుండానే మీకు నచ్చిన ప్రోడక్ట్ ను ఆర్డర్‌ చేసి వాటిని కొనుగోలు చేయవచ్చు.ఫ్యాషన్, బ్యూటీ విషయంలో యూజర్లకు నమ్మకం కలిగించాలంటే ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ రిప్రజెంటేషన్ కచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉందని అందుకే ఎం-లైవ్ ఫ్లాట్‌ఫాంను ప్రవేశ పెట్టాము అని తెలిపారు.

Telugu Latest, Live, Livee, Myntra, Myntracpo, Myntra Live, Launch, Time Product

అలాగే యూజర్లు అడిగిన ఒక ప్రశ్నకు ఇన్‌ఫ్లుయెన్సర్లు 10-14 సెకన్లలో సమాధానం ఇస్తారని మింత్రా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ లలితా రమణి చెప్పారు.ఇలా ఒకేసారి 70 వేల మింత్రా యూజర్లకు ఈ ఎం-లైవ్ సపోర్ట్ చేయనుందని మింత్రా ప్రతినిధులు చెబుతున్నారు.ఇకమీదట మీరు ఏదన్నా షాపింగ్ చేయాలంటే ఇలా లైవ్ లో చూసి ఎంచక్కా షాపింగ్ చేసేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube