నా భార్య తెలుగు అమ్మాయే: సోనూసూద్

సోనూసూద్ ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.కరోనా ముందు కేవలం సినిమాలలో విలక్షణ పాత్రలో నటిస్తూ అందరినీ మెప్పించాడు.

 Sonu Sood Wife Sonali Also Telugu Girl, Sonali Sood, Sonu Sood, Telugu Film Indu-TeluguStop.com

కరోనా సమయంలో ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకొని అందరి దృష్టిలో హీరోగా స్థానం సంపాదించాడు.ప్రస్తుతం సోనూసూద్ ఎన్నో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగానే సోనుసూద్ నటించిన “అల్లుడు అదుర్స్” చిత్రంలో “గజ”పాత్రలో నటించి మరోసారి అందరి చేత ప్రశంసలు పొందాడు.ఈ చిత్రం విజయం సాధించడంతో తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు.
హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా సక్సెస్ వేడుకల్లో భాగంగా పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.ఇందులో భాగంగానే సోనూసూద్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఏ చిత్ర పరిశ్రమలో ఉన్నా కూడా తెలుగు పరిశ్రమను ఎప్పటికి మర్చిపోను తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టం, అభిమానమని ఈ సందర్భంగా సోనుసూద్ తెలియజేశాడు.

Telugu Meet, Sonali Sood, Sonu Sood, Sonusood, Telugu, Tollywood-Movie

నా భార్య సోనాలి సూద్ కూడా తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయే కాబట్టి నేను కూడా మీ కుటుంబంలో ఒకడిని అని తెలిపారు.అదే విధంగా అల్లుడు అదుర్స్ చిత్రంలో గజా లాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, చాలా కష్టపడే గుణం శ్రీనివాస్ కి ఉందని తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి చత్రపతి సినిమా రీమేక్ గా నటిస్తున్నాడనే సంగతి ఇది వరకే మనకు తెలిసిందే.అయితే బాలీవుడ్ లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానట్లు ఈ సందర్భంగా సోను సూద్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube