కొత్తజంట పెళ్ళికి అడ్డు పడనని అంటున్న రాష్ట్రపతి

దేశంలో ప్రధమ పౌరుడు అంటే అతనికి ఉండే గౌరవం వేరుగా ఉంటుంది.ఇక్కడైనా పర్యటనకి వెళ్తే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది.

 My Visit Should Not Be Interrupted By Their Marriage-TeluguStop.com

అక్కడ ఎలాంటి ఫంక్షన్స్ జరిగిన కూడా కచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే.ఇప్పుడు ఓ యువజంటకి అలాంటి పరిస్థితి వచ్చింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన కారణంగా వారు తమ పెళ్లిని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే రాష్ట్రపతి తన ఔన్నత్యాన్ని వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేశారు.

యూస్ కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె ఆశ్లే హాల్ కు మ్యారేజ్ చేయాలని అనుకున్నారు.వివాహానికి కొచ్చిలోని తాజ్‌ హోటల్‌ లో వేదికగా నిర్ణయించారు.

దీనికి సంబంధించి 8 నెలల క్రితమే అడ్వాన్స్ లు ఇచ్చారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేరళ పర్యటనలో భాగంగా తాజ్ హోటల్ లో బస చేయాలని అనుకున్నారు.

అయితే ఈ రాష్ట్రపతి పర్యటన కారణంగా 5వ తేదీన వివాహ ముహూర్తాన్ని మార్చుకోవాలని పెళ్లివారికి హోటల్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది.దీంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు.

అయితే పెళ్లి కూతురు రాష్ట్రపతి భవన్‌ కు ట్వీట్ చేసింది.తన వివాహం అనుకున్న ముహూర్తానికి జరిగేలా చూడాలని కోరింది.

ఈ విషయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ వెంటనే స్పందించారు.తన పర్యటన కారణంగా ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోకూడదని, ముహూర్తానికే మ్యారేజ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.ఈ నేపధ్యంలో హోటల్ సిబ్బంది కూడా రాష్ట్రపతి పర్యటనతో పాటు, పెళ్లి ఫంక్షన్ కి కూడా ఏర్పాట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube