గంగవ్వకు షాకిస్తున్న బిగ్ బాస్ ప్రేమికులు...?

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ వేరు.తొలి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు ఎన్ని విమర్శలు వచ్చినా బిగ్ బాస్ షో హిట్టవుతూనే ఉంది.

 My Village Show Gangavva Is In Elimination Zone, Gangavva, Elimination Zone, Vot-TeluguStop.com

అయితే మూడు సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం మాత్రం చప్పగా సాగింది.ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు ఉండటం… యూట్యూబ్ స్టార్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం బిగ్ బాస్ వీక్షకులకు అస్సలు నచ్చలేదు.

అయితే అఖిల్, అభిజిత్, మోనాల్ మధ్య ప్రేమ దేత్తడి హారిక యాక్టివ్ నెస్ వల్ల రెండో వారం బిగ్ బాస్ షోపై వీక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.ఈ సీజన్ లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే బిగ్ బాస్ అభిమానులను ఎక్కువగా ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ కంటెస్టెంట్ గంగవ్వే అని చెప్పాలి.

ఆరు పదుల వయస్సులో బిగ్ బాస్ షోపై ఏ మాత్రం అవగాహన లేని గంగవ్వ ఈ షోలో పాల్గొనటం నిజంగా సాహసమే అని చెప్పాలి.

ఇప్పటివరకు బిగ్ బాస్ షోను చూడని వారు సైతం గంగవ్వ కంటెస్టెంట్ అని తెలిసిన తరువాత తాము గంగవ్వ కోసమైనా షోను చూస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

తొలి వారం ఎలిమినేషన్ కు గంగవ్వ నామినేట్ కాగా అనధికారికంగా జరిగిన సర్వేల్లో దాదాపు 40 శాతం మంది గంగవ్వకు అనుకూలంగా ఓట్లు వేశారు.అయితే వారంలోనే పరిస్థితి రివర్స్ అయింది.

గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం నచ్చడం లేదు.

తొలి వారం గంగవ్వకు 40 శాతం ఓట్లు అనుకూలంగా రాగా ఆమె షో నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో నెటిజన్లు అనుకూలంగా ఓట్లు వేయడం మానేశారు.

ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన సర్వేలో ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో తొలి స్థానంలో కరాటే కల్యాణి ఉండగా రెండో స్థానంలో గంగవ్వ ఉంది.దీంతో ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా గంగవ్వ షో నుంచి ఎలిమినేట్ కాక తప్పదు.

అయితే గంగవ్వ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆమెను మరికొన్ని వారాలు కొనసాగిస్తారో లేక బయటకు పంపిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube