నా ఫోనూ ట్యాపింగ్ ! ఓహో ఇప్పుడు ఈయన కూడానా ?

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవ్యవహారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలు చేస్తూ పార్టీకి దూరమవుతున్నారు.

 My Phone Is Tapping! Oh Now Is He Too ,ysrcp, Ap Government, Phone Taping, Kotam-TeluguStop.com

ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలు ప్రభుత్వంపై చేస్తూ సంచలనానికి తెర తీశారు.ముఖ్యంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తో పాటు,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్  ట్యాపింగ్ వ్యవహారం పై స్పందించారు.

తమ ఫోన్లను ప్రభుత్వం టాపింగ్ చేస్తోంది అని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు.

Telugu Anamramnarayana, Ap, Kotamsridhar, Pdfmlc, Phone, Ysrcp-Politics

అయితే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం లేదని,  అది రికార్డింగ్ చేసి ఉంటారంటూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా,  ఈ ఆరోపణలు మాత్రం వారు చేస్తూనే ఉన్నారు.తాజాగా  మరో ఎమ్మెల్సీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ, తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు.విపక్ష పిడిఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం ఈ అనుమానాలు వ్యక్తం చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంపై స్పందించిన బాలసుబ్రమణ్యం తన ఫోన్ కూడా నిఘా లో ఉందనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను అలా భావించాల్సి వస్తోంది అంటూ బాలసుబ్రమణ్యం మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

Telugu Anamramnarayana, Ap, Kotamsridhar, Pdfmlc, Phone, Ysrcp-Politics

ఇప్పటికే చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై అనేక అనుమానాలు ఉన్నాయి అంటూ మాట్లాడారు.ఈ క్రమంలోని వైసిపి ఎమ్మెల్యేలతో పాటు , ఇప్పుడు విపక్ష పిడిఎఫ్ ఎమ్మెల్యే కూడా ఈ ఆరోపణలు చేయడం తో మరి కొంతమంది ఈ తరహా విమర్శలు ప్రభుత్వంపై చేసే అవకాశం ఉందని , వెంటనే దీన్ని నిగ్గు తేల్చాలని, ఇప్పటి వరకు అంతా చేస్తున్న ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపించాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube