ఆ విషయంలో నేను వద్దన్నా మా అమ్మ నాన్న వినరు.. కియారా అద్వానీ!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.భరత్ అనే నేను సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 My Parents Read All The Comments On Social Media About Me Says-kiara Advani Kiar-TeluguStop.com

ఇక తన అందంతో మాత్రం యువతను తన వైపు మలుపుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన తల్లి తన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుందట.

ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కియారా అద్వానీ.

మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉంటే ఇటీవలే తాను నటించిన షేర్షా సినిమా విడుదల కాగా మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Bharat Ana Nanu, Bollywood, Kiara Advani, Tollywood-Movie

తాజాగా ఓ షోలో పాల్గొన్న కియారా అద్వానీ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.సోషల్ మీడియాలో తనకు కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తాయని వాటిని అస్సలు పట్టించుకోనని తెలిపింది.ఇక వాటిని ఉదయాన్నే చూసి రోజును ప్రారంభించడం తనకు నచ్చదని తెలిపింది.

కానీ తన తల్లిదండ్రులు మాత్రం తనకు వచ్చే కామెంట్లపై దృష్టి పెడతారంటూ.ఆ కామెంట్లను చదువుతారని తెలిపింది.

తన తల్లికి తాను ఎన్నిసార్లు చెప్పినా వినదంటూ తన గురించి ఏం రాస్తున్నారో తెలుసుకోవాలని తన తల్లికి ఉంటుందని చెప్పింది.

Telugu Bharat Ana Nanu, Bollywood, Kiara Advani, Tollywood-Movie

అందుకే ఈ విషయాలను వాళ్ళకే వదిలేశాను అంటూ.ముఖ్యంగా నెటిజన్లకు ఓ విషయం చెబుతున్నాను అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.సాధారణ వ్యక్తులకు ఉన్నట్లే సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందనివారికి కూడా బంధాలు, బావోద్వేగాలు ఉంటాయని తెలిపింది.

ఇక వాటికి విలువ ఇస్తూ వారిని కూడా గౌరవించడం అనేది ధర్మం అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube