మా అమ్మే నా బెస్ట్ ఫ్రెండ్.. అన్నింటిలో ఆమె సపోర్ట్.. నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిహారిక ఏ రేంజ్ లో అల్లరి చేస్తుందో మనందరికీ తెలిసిందే.

 My Mother Is My Best Friend Niharika Konidela , Niharika, Naga Babu, Tollywood,-TeluguStop.com

మొదట ఈమె బుల్లితెర పై యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది.

అయితే నటిగా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అయితే ఈమె జొన్నలగడ్డ నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే నిహారిక పెళ్లికి ముందు సినిమాలలో, సిరీస్ లో నటించిన నిహారిక పెళ్లి తర్వాత కూడా నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తోంది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక యాంకర్ గా, నటిగా,వెబ్ సిరీస్ ల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది.

అయితే చాలా మంది నిహారిక నాన్న కూచి అని అనుకుంటూ ఉంటారు.కానీ నిహారిక కు అమ్మ అంటే అంతకంటే ఎక్కువ ప్రేమనే.తాజాగా మదర్స్ డే సందర్భంగా తన తల్లితో పాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చింది.నాన్న నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుకుంటాము.

అలాంటి మా నాన్నకి కూడా తెలుసు.నేను అమ్మతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటానని.

చిన్నప్పుడు నాన్నతో ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక ఏజ్ కి వచ్చిన తరువాత మదర్ ను మించిన బెస్ట్ ఫ్రెండ్ ఉండదు అని తెలిపింది నిహారిక.

Telugu Naga Babu, Niharika, Niharika Mother, Tollywood-Movie

అలాగే తాను చిన్నప్పుడు నేను పెద్దగా చదువేది కాదట.స్కూల్ లో టీచర్ బోర్డు పై రాసినవి నోట్ బుక్ లో రాసుకునేది కాదట.ఆ సమయంలో పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని అని తెలిపింది.

అప్పుడు బ్రేక్ సమయంలో వాళ్ళ అమ్మ తన స్కూల్ కి వచ్చి తనకు ఫుడ్ తినిపించేది అని తెలిపింది.తన నోట్స్ లు కూడా తనే రాసేదనీ,తను వాళ్ళ అన్నయ్య వరుణ్ ఎక్కువగా గొడవపడేవాళ్లం అంటూ ఫన్నిగా చెప్పుకొచ్చింది నిహారిక.

అలాగే వాళ్ళ అమ్మ తన పై ఎప్పుడూ కోప్పడేది కాదని,ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం అని తెలిపింది నిహారిక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube