ఊహతో నా ప్రేమ అలా మొదలైంది... హీరో శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శ్రీకాంత్.తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా చేశాడు.ఈయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా ఒక సభ్యుడిగా పని చేశాడు.ఇదిలా ఉంటే తాజాగా తన ప్రేమ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు శ్రీకాంత్.

 My Love Started With Like That Hero Srikanth Comments Viral ,srikanth, Ooha, To-TeluguStop.com

ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత మరెన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.సెకండ్ హీరోగా కూడా పలు సినిమాలలో నటించాడు.

కొన్ని సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించాడు.

ఈయన నటించిన సినిమాలో ఈయనకు ఎక్కువగా గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏంటంటే తాజ్ మహల్, ప్రేయసి రావే, ఆహ్వానం, పెళ్ళాం ఊరెళితే, పెళ్లి సందడి, ఎగిరే పావురమా, ఆమె, ఉయ్యాల ఇలా మరెన్నో సూపర్ హిట్ సక్సెస్ లు అందుకున్న సినిమాలు ఉన్నాయి.

ఇక ఈయన దాదాపు 125 సినిమాలలో నటించాడు.

Telugu Telugu, Telugustop, Tollywood-Movie

ఈయన సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి ఊహ ను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కూడా ఉన్నారు.ఇక కొడుకు ను కూడా హీరోగా పరిచయం చేశాడు శ్రీకాంత్.

త్వరలోనే తన కూతురుని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.ఇక శ్రీకాంత్ హీరోగానే కాకుండా ఈమధ్య విలన్ గా కూడా నటించాడు.

ఇటీవలె బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు శ్రీకాంత్.కానీ శ్రీకాంత్ ఈ సినిమాలో తన పాత్రతో ఆకట్టుకోలేకపోయాడు.

ఆయన అభిమానులు కూడా ఆయనకు విలన్ గా కంటే హీరోగా, సహాయ పాత్రలలోనే మంచి సక్సెస్ ఉంటుందని అంటున్నారు.

Telugu Telugu, Telugustop, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.తాను కర్ణాటక లో పుట్టి పెరిగానని, అక్కడే చదివానని తెలిపాడు.ఇక తన పదో తరగతి తర్వాత తనకు సినిమాలలో నటించాలన్న కోరిక పుట్టిందని తెలిపాడు.

ఇక తనకు చిరంజీవి అంటే ఎంతో అభిమానం అని అన్నాడు.

ఇక తను నటించిన మొదటి సినిమా పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలియటంతో బాగా గోల గోల చేశాడట.

కెరీర్ మొదట్లో ఎక్కువగా నెగెటివ్ పాత్రలో చేసానని తెలిపాడు.ఇక తన భార్య ఊహ నటించిన సినిమాలో తాను హీరో అని ఆ తర్వాత కలిసి పలు సినిమాలలో నటించామని తెలిపాడు.

Telugu Telugu, Telugustop, Tollywood-Movie

ఇక ఊహకు ఫస్ట్ ప్రపోజ్ తానే చేసాడట.మద్రాస్ లోని ఊహ ఇంటికి చైన్ కొనుక్కొని వెళ్లి దేవుడు మందిరం లో ఊహ ను, ఊహ వాళ్ల తల్లిదండ్రులను పిలిచి ఊహకు ప్రపోజ్ చేశానని తెలిపాడు.ఇక ఊహ అసలు పేరు ఉమా మహేశ్వరని కానీ ఇక్కడ ఊహ అని పేరు కూడా పెట్టారని తెలిపాడు.ఊహకు కూడా తనంటే చాలా ఇష్టం అని తెలిపాడు శ్రీకాంత్.

ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube