తల్లయ్యాక నా జీవితమే మారిపోయింది శ్రియ షాకింగ్ కామెంట్స్!

My Life Has Changed Since I Became A Mother Shriya Shocking Comments

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దకాలం వరకు స్టార్ హీరోయిన్ గా  కొనసాగి ప్రస్తుతం పలు సినిమాలల్లో  ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇష్టం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎంతో మందికి ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది.

 My Life Has Changed Since I Became A Mother Shriya Shocking Comments-TeluguStop.com

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే శ్రియ నటించిన గమనం సినిమా డిసెంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

 My Life Has Changed Since I Became A Mother Shriya Shocking Comments-తల్లయ్యాక నా జీవితమే మారిపోయింది శ్రియ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తల్లి అయిన తరువాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.చిన్నప్పటి నుంచి నాకు యోగా చేయడం అలవాటుగా ఉండేది ఈ క్రమంలోని ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఉండేదాన్ని అని తెలిపారు.

అయితే తనకు పాప పుట్టి తను తల్లయిన తర్వాత తన జీవితమే మారిపోయిందని ప్రస్తుతం తన ఫిట్నెస్ గురించి కాకుండా తన బిడ్డ పై శ్రద్ధ చూపిస్తున్నట్లు ఈమె తెలిపారు.ఎవరికైనా పిల్లలు పుట్టిన తర్వాత వారి ప్రపంచమే మారిపోతుంది.బాధ్యతలు కూడా పెరుగుతాయని ఈ సందర్భంగా శ్రీయ తెలిపారు.ప్రస్తుతం మేం ఎక్కడికి వెళ్ళినా తమ కూతురిని వెంట తీసుకెళ్తామంటూ ఈమె తెలిపారు.

#Shriya #Monther

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube