నాన్న ఏడాది జీతంతో నాకు ఫ్లైట్ టికెట్.. ఓర్పు వహిస్తే అద్భుతాలే: విద్యార్ధులతో సుందర్ పిచాయ్

ఇప్పుడు ప్రపంచం కీర్తిస్తున్న వ్యక్తులంతా సాదాసీదాగా ఈ స్థాయికి రాలేదు.దీని వెనుక కృషి, పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణ ఉన్నాయి.

 My Father Spent A Year's Salary On My Plane Ticket To Us: Google Ceo Sundar Pich-TeluguStop.com

సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వీరంతా శిఖరాలను అందుకున్నారు.అలాంటి వారిలో ఒకరు టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.

తాను ఈ స్థాయికి రావడం వెనుక చూసిన ఎత్తుపల్లాలను, జీవితంలో విజయం సాధించడానికి అనుసరించిన మార్గాలను ఆయన విద్యార్ధులతో పంచుకున్నారు.‘‘ డియర్ క్లాస్ 2020 ’’ పేరుతో గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్.

ఓ వర్చువల్ గ్రాడ్యుయేషన్ సమ్మిట్‌ను నిర్వహించింది.

దీనికి హాజరైన విద్యార్ధులను ఉద్దేశించి సుందర్ పిచాయ్ ప్రసంగించారు.

నమ్మకం, సహనం, ఆత్మ విశ్వాసం వుంటే ప్రతికూల పరిస్ధితులను అవలీలగా ఎదుర్కోగలరని ఆయన గ్రాడ్యుయేట్లకు ధైర్యాన్ని నూరిపోశారు.కరోనాతో కష్టమే అని విద్యార్ధులు భావిస్తున్న సమయంలో ఆయన తాను అమెరికాకు వచ్చిన తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తాను మొదటిసారి విమానం ఎక్కానని పిచాయ్ గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో ఫ్లైట్ టికెట్ కోసం తన తండ్రి.

ఏడాది పాటు సంపాదించినంత వేతనాన్ని ఖర్చుపెట్టారని ఆయన తెలిపారు.అమెరికా చాలా ఖరీదైన దేశమని.

ఆ సమయంలో భారత్‌కు ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చవుతుందని.ఓ బ్యాగ్ కొనాలంటే తన తండ్రి నెల జీతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని సుందర్ అన్నారు.

అలాంటి పరిస్దితుల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానన్న ఆయన.ఓ సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఈ స్థాయికి తనను చేర్చిన అంశం లక్ కాదన్నారు.టెక్నాలజీపై తనకు ఉన్న మక్కువ, ఓపెన్ మైండ్… ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకునేలా చేసిందని విద్యార్ధులకు చెప్పారు.

Telugu Dear Classs, Google Ceo, Salaryplane, Plane Ticket, Salary, Sundar Pichai

మన ముందు తరాల విద్యార్ధులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డారని సుందర్ పిచాయ్ చరిత్రలోకి వెళ్లారు.1920లో విద్యార్ధులకు కూడా కరోనా లాంటి ఓ మహమ్మారి సవాల్ విసిరిందని, 1970లోనూ విద్యార్ధులు వియత్నాం వార్ జరుగుతున్నప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని చెప్పారు.2001లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొన్ని నెలలకే న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారని ఆయన గుర్తుచేశారు.కాగా చెన్నైలో పుట్టి పెరిగిన సుందర్ పిచాయ్. ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్.ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.ప్రస్తుతం మనం వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube