ఐటీ దాడుల వల్ల వాళ్లు కోపంగా ఉన్నారు.. సోనూసూద్ కామెంట్స్ వైరల్!

సోనూసూద్ పై ఐటీ దాడుల గురించి దేశంలోని ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోందనే సంగతి తెలిసిందే.ఎంతోమంది సినీ ప్రముఖులు ఉండగా సోనూసూద్ ను మాత్రమే టార్గెట్ చేసి ఐటీ దాడులు చేశారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

 My Fans Supporteres Were Hurt By News Of Tax Raids Says By Sonusood-TeluguStop.com

ఇప్పటికే ఐటీ దాడుల గురించి స్పందించిన సోనూసూద్ తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై జరిగిన ఐటీ దాడుల పట్ల తన ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారని సోనూసూద్ చెప్పుకొచ్చారు.మనం మంచి చేయాలని అనుకుంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనూసూద్ తెలిపారు.

 My Fans Supporteres Were Hurt By News Of Tax Raids Says By Sonusood-ఐటీ దాడుల వల్ల వాళ్లు కోపంగా ఉన్నారు.. సోనూసూద్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను మాత్రమే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న మొదటి వ్యక్తినని తాను భావించడం లేదని సోనూసూద్ చెప్పుకొచ్చారు.ఐటీ అధికారులు వచ్చిన తర్వాత అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని తాను చెప్పానని సోనూసూద్ వెల్లడించారు.

ఏ రీజన్ వల్ల ఐటి దాడులు జరిగాయో తనకు కూడా తెలియదని సోనూసూద్ వెల్లడించారు.కొందరు తనపై జరిగిన ఐటీ రైడ్స్ ను పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారని సోనూసూద్ తెలిపారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలవడం వల్లే ఈ దాడులు జరిగినట్టు చాలామంది కామెంట్లు చేస్తున్నారని సోనూసూద్ వెల్లడించారు.కేజ్రీవాల్ తో సమావేశమైన సమయంలోనే ఆ మీటింగ్ పొలిటికల్ మీటింగ్ కాదని తాను చెప్పానని సోనూసూద్ పేర్కొన్నారు.

తన ప్రధాన లక్ష్యం చిన్నారులు చదువుకునే విధంగా చేయడమే అని సోనూసూద్ చెప్పుకొచ్చారు.చాలామంది ఫ్యాన్స్ తనను ఫ్యామిలీ మెంబర్ లా భావించారని అందువల్ల ఈ దాడుల విషయంలో వాళ్లు ఆగ్రహంగా ఉన్నారని సోనూసూద్ పేర్కొన్నారు.సోనూసూద్ పై ఐటీ రైడ్స్ విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Sonusood #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు