నన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తున్నారంటున్న నటి!

“ఉడాన్‌”, “హోటెల్‌ మిలాన్‌” వంటి బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్న నటి మాల్వీ మల్హోత్రా పై అక్టోబర్ 26న నిర్మాత యోగేశ్‌ మహిపాల్‌ సింగ్‌ తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో తనపై దాడికి పాల్పడిన విషయం మనకు తెలిసినదే.తన వివాహానికి నిరాకరించిందన్న కోపంతో మాల్వీ మల్హోత్రా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేసు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యోగేష్ తనపై కత్తితో దాడి చేశారు.

 My Family And I Are Getting Death Threats Says Malvi Malhotra, Malvi Malhotra, D-TeluguStop.com

తీవ్రంగా గాయపడిన మాల్వీ మల్హోత్రా చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.అయితే ఐపీసీ సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న వెర్సోవా ప్రాంత పోలీసులు యోగేష్ అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసి మరుసటి రోజే అతని కటకటాల్లోకి తోసేశారు.

అయితే తన గాయం నుంచి పూర్తిగా కోలుకోని మాల్వీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

Telugu Bollywood, Threats, Malvi Malhotra, Serial Actress-Latest News - Telugu

సాయంత్రం ఇంటి ఆవరణంలో వాకింగ్ చేస్తుండగా బైక్ పై ఒక వ్యక్తి మాస్కు ధరించి తన దగ్గరికి వచ్చి యోగేష్ అన్న కు బెయిల్ వచ్చిన వెంటనే మీ కుటుంబం అంతం చూస్తామని, తన తండ్రిని చూస్తూ గట్టిగా అరచి నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ,మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలా బెదిరించినప్పటి నుంచి ప్రతి రోజు ఎంతో భయాందోళనలతో గడుపుతున్నామని, మరో ఇంటికి మారేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సందర్భంలో నటి మాల్వీ పేర్కొన్నారు.

తన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న మాల్వీ ఇంకా గాయం సరిగా మానలేదు,కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను.

కొద్దిగా వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల సహాయంతో వాకింగ్ చేస్తున్న సమయంలో ఇలా ఒక వ్యక్తి ఇంటిలోకి చొరబడి నన్ను, నా కుటుంబాన్ని బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపారు.అయితే యోగేష్ పై కఠినంగా చర్యలు తీసుకోనీ అతనిని శిక్షించాలని ఆమె తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube