టక్కర్ సినిమాతో నా కల నెరవేరింది... సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్ (Siddharth) ఒకరు.సిద్ధార్థ హీరోగా బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 My Dream Came True With The Film Tucker Details, Siddharth,takker,ramanaidu,acti-TeluguStop.com

ఇలా పలు సినిమాలలో నటించి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సిద్ధార్థ్ కొంతకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.గత ఏడాది క్రితం శర్వానంద్ (Sharwanand) తో కలిసి మహాసముద్రం(Mahasamudram) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Karthik, Loverboy, Mahasamudram, Ramanaidu, Sharwanand, Siddharth, Takkar

ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.ఇకపోతే తాజాగా దర్శకుడు కార్తీక్ జీ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ట్రక్కర్ (Takkar) .ఈ సినిమా జూన్ 9వ తేదీ విడుదల కానుంది.తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సురేష్ బాబు, బొమ్మరిల్లు భాస్కర్, తరుణ్ భాస్కర్ వంటి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Telugu Karthik, Loverboy, Mahasamudram, Ramanaidu, Sharwanand, Siddharth, Takkar

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.టక్కర్ సినిమా ఒక యాక్షన్‌ ఫిల్మ్‌(Action Film).యాక్షన్‌లో ఓ లవ్‌స్టోరీని యాడ్‌ చేశారు మా దర్శకుడు.ఇప్పటివరకు మీరు సిద్ధార్థ్‌ని సాఫ్ట్‌ లవర్‌గానే చూశారు.

ఈ చిత్రంలో లవర్‌బాయ్‌(Lover Boy) రగడ్‌గా కనిపిస్తాడు.ఈ సినిమా చూడటానికి మీరందరూ తప్పకుండా థియేటర్లకు రావాలని సిద్ధార్థ్‌ కోరారు.

పూర్తి యాక్షన్ సినిమా చేయాలని నా కల ఈ సినిమాతో నెరవేరిందని ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ తెలియజేశారు.ఇక తాను చిన్నవయసులోనే లెజెండ్స్ తో కలిసిన నటించే అవకాశం తనకు వచ్చిందని ఇది తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని సిద్ధార్థ్‌ తెలిపారు.

ప్రముఖ నిర్మాత రామానాయుడు(Ramanaidu) గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సాహం నేను ఎప్పుడు మరువలేనని తాను సురేష్ ప్రొడక్షన్ కి ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube