ఇంట్లో నాన్నని ఎదురించి నటించా.. ఊహించని స్థాయిలో అభిమానం పండింది!

My Dad Wanted Me To Quit Acting Coming Back Was The Real Agnipariksha Tanuja Gowda

బుల్లితెర నటి తనుజా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ ముద్దమందారం సీరియల్ లో పార్వతి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఈ ముద్దమందారం సీరియల్ ద్వారా తనూజ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

 My Dad Wanted Me To Quit Acting Coming Back Was The Real Agnipariksha Tanuja Gowda-TeluguStop.com

అయితే కాలం ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగ పరీక్షిస్తుందని అంటుంటారు.అలా తనూజాని కూడా కాలం పరీక్షించడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.

ఈ క్రమంలోనే తన తండ్రిని ఎదిరించి మరీ నటనలో కొనసాగించింది.ఇప్పుడు తనూజకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

 My Dad Wanted Me To Quit Acting Coming Back Was The Real Agnipariksha Tanuja Gowda-ఇంట్లో నాన్నని ఎదురించి నటించా.. ఊహించని స్థాయిలో అభిమానం పండింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనూజ పుట్టింది కర్ణాటక పెరిగింది అంతా బెంగళూరులోనే.ఈమెకు ఇంటర్ వరకు చదువు తప్ప వేరే విషయాలపై ఆసక్తి లేదట.కానీ కాలేజీ ఫంక్షన్ లో ఒక ఛానల్ వాళ్ళు ఆమెను చూసి ఒక షో చేయమని అడగడంతో, ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసిందట.కానీ ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో అని భయం అందుకే చెప్పలేదు.

ఆదివారం ప్రసారమయ్యే ఆ కార్యక్రమంలో ఫ్రెండ్ లెక్చరర్ సహాయంతో చేసేదాన్ని.

అలా ఇంట్లో ఎవరికీ టీవీ చూసే అలవాటు లేకపోవడంతో చాలా రోజుల వరకూ ఏ సమస్య రాలేదు.

కానీ ఒకరోజు ఆమె తల్లికి ఎవరో చెప్పడంతో పెద్ద గొడవ అయ్యిందట.

Telugu Face Problems, Mudda Mandaram, Parvathi, Serialactress, Tanuja Gowda, Thanuja, Zee Telugu-Movie

ఆ తర్వాత ఆమె తన తల్లిని ఒప్పించిందట.కానీ ఆమె తండ్రి ఈ సినిమా పరిశ్రమ అంటే పడదట.అలా తన తండ్రికి తెలియకుండానే ఆరునెలలు మేనేజ్ చేసిందట.

అలా ఆమె తన తండ్రికి తెలియకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిందట.అలా ఆమె నటించిన చిత్రం కాదు నిజం అదే సినిమా విడుదల కావడంతో ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి పెద్ద గొడవ జరిగిందట.

ఆ సమయంలోనే ఆమె తల్లి కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ తన తన తండ్రితో కోట్లాడి హైదరాబాద్ కు వచ్చేసిందట.

Telugu Face Problems, Mudda Mandaram, Parvathi, Serialactress, Tanuja Gowda, Thanuja, Zee Telugu-Movie

అలా ఆమెకు ముద్దమందారం సీరియల్ తో మంచి గుర్తింపు పేరు రావడంతో ఆమె ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.అనంతరం ఆమె నటిస్తున్న సీరియల్ తన తండ్రి చూస్తున్నారన్న విషయం తెలియగానే ఆమె తన తండ్రితో మాట్లాడిందట.అయినా కూడా ఆమె తండ్రి ఆమెపై కోపంగానే ఉన్నాడట.

అలా లాక్ డౌన్ సమయంలో ఆమెకు ఎన్ని అవకాశాలు వచ్చాయి.ఈ క్రమంలోనే జీతెలుగు వాళ్లు ఏ షో చేసినా పార్వతిని మళ్లీ తీసుకురండి అంటూ అభిమానులు నుంచి మెసేజ్ లు, కామెంట్ లు రావడంతో ఆమె తిరిగి వాళ్ళ నాన్నను ఒప్పించి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది.

#ActressTanuja #Problems #Thanuja #Parvathi #Tanuja Gowda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube