వ్యాపారంలో నష్టపోయిన రకుల్.. ఏం జరిగిందంటే..?

గతేడాది శరవేగంగా విజృంభించిన కరోనా మహమ్మరి వల్ల కేంద్రం లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ వల్ల దాదాపు రెండున్నర నెలల పాటు దేశంలో పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు కావడంతో వ్యాపారులు నష్టాల బాట పట్టారు.

 My Business Effected With Corona Pandemic Says Rakul Preet Singh-TeluguStop.com

లాక్ డౌన్ వల్ల తాను కూడా నష్టపోయానని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. చెక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన రకుల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్, వైజాగ్ లో రకుల్ కు సొంతంగా జిమ్ సెంటర్లు ఉండగా లాక్ డౌన్ వల్ల జిమ్ సెంటర్లు మూతబడ్డాయి.కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత జిమ్ సెంటర్లు తెరుచుకున్నా ఎక్కువ మంది జిమ్ లకు రావడానికి ఆసక్తి చూపించలేదు.

 My Business Effected With Corona Pandemic Says Rakul Preet Singh-వ్యాపారంలో నష్టపోయిన రకుల్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కరోనా వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చినా తన జిమ్ లలో పని చేసే వాళ్లందరికీ రకుల్ వేతనం చెల్లించారు.అయితే కరోనా ఉధృతి తగ్గడంతో రకుల్ వ్యాపారం ఇప్పుడు బాగానే ఉందని సమాచారం.

మూడు రోజుల క్రితం రకుల్ హీరోయిన్ గా నటించిన చెక్ సినిమా విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ తన బిజినెస్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించారు.మరోవైపు చెక్ మూవీలో రకుల్ పాత్ర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.దర్శకుడు ఆ పాత్రను సరిగ్గా తీర్చిదిద్దలేక పోయాడని రకుల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.రకుల్ కు స్క్రీన్ టైమ్ ఎక్కువగానే ఉన్నా పాత్రను హైలెట్ చేసే సన్నివేశాలు మాత్రం ఎక్కువగా లేవు.

గతేడాది రకుల్ కు పెద్దగా కలిసిరాలేదు.2021 సంవత్సరంలో రకుల్ కు చెక్ షాక్ ఇవ్వగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే రకుల్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా అయినా రకుల్ కు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

#Promotions #Gym Centers #Interview #Lock Down #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు