ఈమద్య కాలంలో తెలుగులో అడల్ట్ కంటెంట్ చిత్రాలు మరీ ఎక్కువ అవుతున్నాయి.అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ముద్దు సీన్స్ చాలా కామన్ అయ్యాయి.
ఒకప్పుడు ఒకటి రెండు సీన్స్‌లో ముద్దు సీన్స్ ఉండేవి.కాని ఇప్పుడు అవి ఏ స్థాయిలో ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
ఇటీవలే డర్టీ హరీ ఇంకా కొన్ని సినిమాలు మరీ బి గ్రేడ్ చిత్రాల మాదిరిగా ఉంటున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు సెన్సార్ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు తీసేస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం ట్రైలర్ వచ్చింది.ఈ సినిమా కూడా అదే బాపతు అన్నట్లుగా ట్రైలర్ ఉంది.
ఈ ట్రైలర్‌పై ఒక వర్గం వారు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందింది.
ఇద్దరు అమ్మాయిలను గాడంగా ప్రేమించే ఒక అబ్బాయి కథ ఇది.ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని మనసుతో మరో అమ్మాయిని కామంతో ప్రేమిస్తాడు.
ఇద్దరిని కూడా పెళ్లి నుండి లేపుకు వెళ్లి ఆ తర్వాత ఆలోచనల్లో పడే వ్యక్తి కథే ఈ సినిమా.స్టోరీ లైన్ కాస్త వింతగా ఆసక్తికరంగా ఉన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బూతు సినిమాగా చూస్తున్నారు.
ముద్దు సీన్స్ మరియు హద్దులు లేకుండా ఉన్న డైలాగ్స్ వంటి వాటి కారణంగా ఈ సినిమాను బూతు సినిమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి సినిమాలు ఓటీటీలోనే విడుదల అవుతాయి.
కనుక ఇది కూడా ఏదో ఒక ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.