నేను నటినని నా ప్రియుడు నన్ను వదిలేశాడు.. షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సూపర్‌ 30 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నటి మృణాల్‌ ఠాకూర్‌.ఈమె హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

 My Boyfriend Left Me Because Im Actress Heroine Told Shocking Facts, Super 30 Mo-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ షాహిద్ కపూర్ సరసన జెర్సీ హిందీ రీమేక్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తెలుగులో నాని నటించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు.

తెలుగులో ఈచిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా హిందీలో కూడా ఈ చిత్రానికి ఆయనే దర్శకుడుగా పనిచేశారు.ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది.

అయితే ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ షాహిద్ కపూర్ మాత్రం ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతమవుతుంది ఈ సినిమాని థియేటర్లోనే చూడాలని ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు.

ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి మృణాల్‌ ఠాకూర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.కేవలం తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలియజేశారు.

చిన్న వయసులోనే తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని మానసికంగా ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డానని తెలియజేశారు.ఒకానొక సందర్భంలో చచ్చిపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నానని నటి మృణాల్‌ ఠాకూర్‌ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ప్రతి ఒక్కరి మాదిరిగానే పెళ్లి పిల్లలు కాకుండా జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనతో ఇండస్ట్రీలోకి వచ్చానని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేశారు.ఇక తన లవ్ బ్రేకప్ గురించి కూడా ఈ సందర్భంగా ఈమె ముచ్చటించారు.తాను ఒక వ్యక్తితో గత కొన్ని నెలల నుంచి రిలేషన్ లో ఉన్నానని అయితే ఇప్పుడు తన లవ్ కి బ్రేకప్ చెప్పినట్లు తెలియజేశారు.నేను ప్రేమించిన వ్యక్తి సాంప్రదాయ పద్ధతిలో ఉన్న కుటుంబంలో పుట్టిన వాడు ఆయనకు నేను నటిగా ఉండటం నచ్చలేదు కేవలం నేను నటిని అన్న కారణంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారుని ఈ సందర్భంగా తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు.

కానీ అతని పై నాకు ఎలాంటి కోపం లేదని ఒకవేళ మేమిద్దరం సర్దిచెప్పుకొని మా రిలేషన్ లో కొనసాగిన పెళ్లి తర్వాత అయినా ఎన్నో సమస్యలు వస్తాయని ఆ సమస్యల కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇద్దరం విడిపోయామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube