నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్.. ఉపాసన కామెంట్స్ వైరల్?

ఉపాసన కొణిదెల ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.స్టార్ హీరో కోడలిగా మరొక స్టార్ హీరో భార్యగా, అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన అందరికీ సుపరిచితమే.

 My Best Friend Is-a Transgender Upasana Comments Viral Upasana, Ram Charan , Wif-TeluguStop.com

ఉపాసన ఒక గొప్ప ఇంటి కోడలు అయినప్పటికీ సామాజిక అంశాలపై ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటారు.ఇలా వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉండే ఉపాసన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఉపాసన ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చాలామంది బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతారు మరి మీ విషయంలో అంటూ యాంకర్ అడగగా.

అందుకు ఉపాసన స్పందిస్తూ చాలామంది పుట్టడమే బంగారు స్పూన్ తో పుట్టారు వీరికి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతుంటారు అయితే నిజానికి అలాంటి వాళ్లకి ఎన్నో సమస్యలు ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.నా సమస్యలు మీకు తెలియవు మీ సమస్యలు నాకు తెలియవు కానీ ఒకరి సమస్యలను ఒకరు గౌరవించుకోవాలి అంటూ ఈ సందర్భంగా తెలిపారు.

Telugu Friend, Ram Charan, Tollywood, Transgender, Upasana-Movie

అదేవిధంగా ఎంతో స్ట్రాంగ్ ఉమెన్ ను అబ్బాయిలు భరించలేరు అని చెబుతుంటారు దానికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించడంతో అందుకు ఉపాసన అదే ప్రశ్నను యాంకర్ ను అడిగారు.ఒక స్ట్రాంగ్ మెన్ నుఒక ఉమెన్ భరించగలదా అంటూ ప్రశ్నించగా అందుకు ఈమె మీరు భరిస్తున్నారు కదా అంటూ సమాధానం చెప్పారు.

Telugu Friend, Ram Charan, Tollywood, Transgender, Upasana-Movie

అయితే తనకు ఉపాసన సమాధానం కావాలని అడగడంతో తన దృష్టిలో జెండర్ గురించి పెద్దగా మాట్లాడటానికి ఏమీ ఉండదని ఇప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ట్రాన్స్ జెండర్ అని అయితే తన అన్ని విషయాలలో ఎంతో చురుగ్గా ఉంటుందని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. ఆమెకు అక్షయ్ కుమార్ కూడా ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు.మరెందుకు అబ్బాయిలు స్ట్రాంగ్ అమ్మాయిలు స్ట్రాంగ్ అని మాట్లాడుతారు ఇలా మాట్లాడటం ఆపండి.అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా ఎంతో ఉన్నతంగా ఆలోచించండి అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube