అయ్యబాబోయ్ ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్‌ ధర ఇంతుందా.. ?

ప్రస్తుతం బర్డ్‌ ఫ్లూ భయం మాంసం ధరలపై అధిక ప్రభావాన్ని చూపుతోందంటున్నారు దుకాణ దారులు.అదీగాక సంక్రాంతి పండగ రావడంతో మాంసం వినియోగించే వారు అధికం అవడంతో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయట.

 Mutton Price Rises In Telugu State Markets, Andhra Pradesh, Telangana, Mutton, C-TeluguStop.com

అయితే బర్డ్‌ ఫ్లూ వల్ల చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా మటన్ రేటు మాత్రం ఊహించని స్దాయికి చేరుకుంటుందంటున్నారు.బర్డ్‌ఫ్లూ నేపధ్యంలో చికెన్‌ కొనేందుకు జంకుతున్న వారంతా మటన్‌ వైపు మళ్లుతున్నారు.

దీంతో కొందరు వ్యాపారులు ఇప్పటికే ధరలు పెంచేయగా, మరి కొందరు కూడా అదే బాట పట్టారట.

ఇక గత కొన్ని రోజుల క్రిత్రం నుండి మటన్‌ ధర కిలో కు 650 నుండి 700 రూపాయలు ఉండగా ప్రస్తుత పరిస్దితుల్లో ఏకంగా కిలో 900 నుండి 1000 రూపాయల వరకు వ్యాపారులు పెంచేశారట.

ఇక చేపల ధరలు కూడా భారీగానే పెరిగాయట.ఏది ఏమైన అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మన వ్యాపారులకు బాగా అలవాటైందని అనుకుంటున్నారట మాంసం తినే వినియోగదారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube