తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన దాదాపు మూడు నెలల కాలంలోనే సుమారు 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందించామని వెల్లడించారు.
ఆరు గ్యారెంటీల హామీల అమలులో ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.తమది ప్రజా ప్రభుత్వమన్న ఆయన ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని వెల్లడించారు.