హిందువుల గుడిలో ముస్లింల పూజలా.. అదెక్కడా?

హిందువులు గుడులకు వెళ్లడం, ముస్లింలు మసీదులకు వెళ్లడం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే హిందువులు మసీదుకు వెళ్లడం, ముస్లింలు గుడికి మనం చాలా అరుదుగా చూస్తుంటాం.

 Muslims Are Part Of Durga Puja Celebration In This Assam Temple , Billeshwara T-TeluguStop.com

 ఒకప్పుడు ఇలాంటివేం లేకపోయినా… ఆ మధ్య చాలా మంది తమకు నచ్చిన దేవుడిని మొక్కుతున్నారు. మరి కొందరు అయితే గుడితో పాటు మసీదులు, చర్చిలకు వెళ్తూ… దేవుడిని ప్రార్థిస్తున్నారు.

 మన దేశంలో ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు మొక్కే హక్కు ఉన్నప్పటికీ… ఇలాంటి ఘటనలు మనం చాలా తక్కువగా చూస్తుంటాం. అయితే అసోంలోని ఓ దేవాలయంలో మాత్రం 350 ఏళ్ల నుంచే హిందూ, ముస్లింలిద్దరూ కలిసి పూజలు చేయడం గమనార్హం.

 అలా ఎందుకు చేస్తున్నారు. ఆ ఆలయం ఎక్కుడుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ అసోంలోని నల్ బరి పట్టణానికి 10 కిలో మీటర్ల దూరంలో బిల్లేశ్వర దేవాలయం ఉంది. ఆ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో కచ్చితంగా తెలియక పోయినప్పటికీ. నాగాక్ష రాజు ఈ గుడిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నవరాత్రి సమయంలో కేవలం హిందువులే కాకుండా ఇక్కడికి ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా ఈ ఆలయంలోని నైవేద్యంలో కొంత భాగాన్ని ముస్లింలకు పంచి పెట్టడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. గుడి నిర్మించిన రాజే ఆలయంలోని నైవేద్యంలో కొంత భాగాన్ని ముస్లింలకు ఇవ్వాలని నిర్మించారట.

 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంలో పూజలు, పండుగల అప్పుడు ముస్లింలు భాగం అవుతుంటారు.

MUSLIMS ARE PART OF DURGA PUJA CELEBRATION IN THIS ASSAM TEMPLE , Billeshwara Temple , Devotional , Hinduvulu , Muslims In Hindu Temples , Telugu Devotional - Telugu Devotional, Hinduvulu, Muslimshindu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube