మోడీ కి గుడి కట్టాలనుకుంటున్న ముస్లింలు!  

Muslim Women Team Wants To Build A Temple For Narendra Modi-indian President Narendra Modi,muslim Women,rubi Gazini,uttar Pradesh Samar Gazini

కొందరు ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి గుడి కట్టాలని భావిస్తున్నారట.ఇంతకీ వారు ఎవరు ఎక్కడ నుంచి అని అనుకుంటున్నారా.ఆ వివరాల్లోకి వెళితే….ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో కొందరు ముస్లిం మహిళలు మోడీ పేరు మీద గుడి నిర్మించాలని భావిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ కు కూడా వినతి పత్రం అందజేసినట్లు తెలుస్తుంది.

Muslim Women Team Wants To Build A Temple For Narendra Modi-indian President Narendra Modi,muslim Women,rubi Gazini,uttar Pradesh Samar Gazini-Muslim Women Team Wants To Build A Temple For Narendra Modi-Indian President Modi Muslim Rubi Gazini Uttar Pradesh Samar

ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు అయిన సమర్ గజ్ని,రుబీ గజ్ని లు కొందరు ముస్లిం మహిళల తో కలిసి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి తన పత్రిపాదనకు సంబందించిన వినతి పత్రాన్ని అందజేశారు.దేశం కోసం మోడీ గారు ఎంతో శ్రమిస్తున్నారని అందుకే ఆయనకు తప్పకుండా మందిరం నిర్మిస్తామంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు.

Muslim Women Team Wants To Build A Temple For Narendra Modi-indian President Narendra Modi,muslim Women,rubi Gazini,uttar Pradesh Samar Gazini-Muslim Women Team Wants To Build A Temple For Narendra Modi-Indian President Modi Muslim Rubi Gazini Uttar Pradesh Samar

యూపీ లోని క్రిష్ణ పూరి ప్రాంతంలో తమ సొంత స్థలం ఉందని దానిలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి గుడి నిర్మిస్తామని వారు వెల్లడించారు.మోదీకి మందిరం నిర్మించడమే కాకుండా ఆయన జీవిత చరిత్ర విషయాలను మందిరంలో పొందుపరుస్తామని, అందులో మోదీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముస్లిం మహిళలు ప్రతి పాదన లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే యుఎఇ ప్రభుత్వం అత్యున్నత పౌర పురష్కారంతో ప్రధాని మోదీని సత్కరించడంతో వారికి ఈ ఆలోచన వచ్చిందని వారు చెబుతున్నారు.

మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాతే ట్రిపుల్ తలాక్ బిల్లు అనేది సభలో ప్రవేశపెట్టడం దానికి విపక్షాలు కూడా ఒకే చెప్పడం వంటి పనులు జరిగాయి.

ఈ బిల్లు తో ముస్లిం మహిళల కు ఒక సెక్యూరిటీ అనేది లభించడం తో ప్రతి ఒక్కరూ కూడా మోడీ అంటేనే అభిమానిస్తున్నారు