వైరల్: అమ్మవారి గుడిలో ముస్లిం మహిళ ప్రత్యేక పూజలు..!

ఇండియాలో అనేక మతాలు ఉన్నాయి.అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతుంటారు.

 Muslim Woman Worships At Her Mother's Temple Muslim Woman, Offers, Special Puja-TeluguStop.com

అందుకే భారతదేశాన్ని లౌకిక దేశం అని అంటారు.ఇక్కడి దేవాలయాల్లో ముస్లింలు పూజలు చేస్తుంటారు.

అలాగే మసీదులకు హిందువులు వెళ్తుంటారు.ఒకరికొకరు సోదర భావంతో పండగలు చేసుకుంటూ ఉంటారు.

అందుకే భారతదేశంలో అనేక మతాల సమూహంగా పిలుస్తుంటారు.ఇండియాలో దసరా పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఎంతో వైభవంగా పండగ జరుగుతుంది.ఒక్కోరోజు ఒక్కో రూపంలో ఆ దేవత అందరికీ దర్శనమిస్తుంది.

అమ్మవారి పూజలు ఎంతో వైభవంగా సాగుతాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్‌ సిటీలోని భగవతి అమ్మవారి దేవాలయంలో కూడా వేడుకలు బాగా జరుగుతాయి.

ప్రతి ఏడాది ఇక్కడ దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి.ఈసారి ఇక్కడి దేవాలయంలోని అమ్మవారికి ఓ ముస్లిం మహిళ ప్రత్యేక పూజలు చేసి తన భక్తిని చాటుకుంది.

దీనికి ఓ పెద్ద కారణమే ఉంది.ఆ అమ్మవారి దేవాలయాన్ని 50 ఏళ్లక్రితం ఆమె భర్త కట్టించాడు.

రైల్వే ఉద్యోగి అయిన తన భర్త 50 ఏళ్ల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించాడు.ఆ భగవతి అమ్మ దేవాలయాన్ని కట్టించి హిందూ సమాజానికి ఆ దేవాలయాన్ని అప్పగించాడు.

ఈ విషయాన్ని ముస్లిం మహిళ ఫమీదా తెలియజేసింది.దసరా ఉత్సవాల సందర్భంగా చనిపోయిన తన భర్త నిర్మించిన ఆలయంలో అమ్మవారికి పూజలు చేసానని ఆమె తెలియజేసింది.

ఇలా అమ్మవారిని పూజించటం వల్ల తన భర్తకు తానిచ్చే గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది.

Telugu Bhagawati Amma, Offers, Puja, Latest-Latest News - Telugu

భారతీయ సంస్కృతిని గౌరవించటం ప్రతీ భారతీయుల కర్తవ్యమని ఫమీదా తెలియజెప్పడంతో అక్కడున్నవారు ఆమెను ప్రశంసిస్తున్నారు.దేవీ నవరాత్రులు ప్రతి అమ్మవారి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తారు.అలాగే ఈ దేవాలయంలో కూడా నిర్వహిస్తున్నారు.

ఈ ఆలయాన్ని కట్టించినది ఒక ముస్లిం అయినప్పటికీ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారంగా దేవాలయ నిర్మాణ కర్తను గౌరవిస్తుంటారు.ప్రస్తుతం ఫమీదాను కూడా స్థానికులు గౌరవ మర్యాదలతో సత్కరించడం ఆచారంగా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube