విడ్డూరం : ఆమె ఫొటో దిగిన పాపానికి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది  

Muslim Woman Sent To Jail For Taking Selfie On Road-muslim,saudi,selfie,జైలు శిక్ష,సౌదీ

ప్రపంచం మొత్తం అభివృద్ది పథంలో దూసుకు పోతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా టెక్నాలజీ పేట్రేగి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్మ్‌ ఫోన్‌ల యుగం వచ్చింది..

విడ్డూరం : ఆమె ఫొటో దిగిన పాపానికి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది-Muslim Woman Sent To Jail For Taking Selfie On Road

ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సరదాను స్నేహితులతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే సౌదీలో మాత్రం ఫొటోలు దిగడం నిషేదం, ముఖ్యంగా ఆడవారు బహిరంగ ప్రదేశాల్లో ఫొటోలు దిగితే వారికి కఠిన శిక్షలను స్థానిక ప్రభుత్వాలు వేస్తున్నాయి. తాజాగా ఒక మహిళ ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టి ఫొటో దిగేందుకు సిద్దం అయ్యింది.

ఆ సమయంలో ఆమె పక్కన ఉన్న వారు కూడా ఆమెను వారించారు. రోడ్డు పై ఒక మహిళ అది కూడా బుర్ఖా తీసివేసి ఫొటో దిగేందుకు సిద్దం అయ్యింది. తాను దిగబోతున్న ఫొటో సౌదీలోని ఆడవారికి స్వేచ్చను తీసుకు రావాలనుకుంది.

ప్రభుత్వంపై యుద్దం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ పనికి సిద్దం అయ్యింది. దాంతో ఆమె పెద్ద కష్టాల్లో పడింది. సాదారణంగా ఆడవారు ఫొటోలు దిగితే జరిమానా లేదంటే ఒకటి రెండు వారాల జైలు శిక్ష ఉంటుంది.

కాని ఈమె ఉద్దేశ్య పూర్వకంగా, కావాలని ముస్లీం సాంప్రదాయాలను మంట కలపాలనే ఉద్దేశ్యంతో ఫొటో దిగిందని న్యాయస్థానం భావించింది.

మత పెద్దలు మరియు న్యాయస్థానం చర్చించి ఆమెకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల డాలర్ల జరిమాన కూడా విధించడం జరిగింది. ఆమె చేసిన నేరం చిన్నదే అయినా ముస్లీం మతంనే కించపర్చే విధంగా ఆమె వ్యవహరించిందని మత పెద్దలు అంటున్నారు. అందుకే ఆమెకు 6 నెలల జైలు, ఈ సంఘటన స్థానికంగా సంచలనం అయ్యింది. సెల్ఫీల మోజుతో ప్రపంచం ఊగిపోతుంటే సౌదీలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణం.

ఈ విషయమై మానవ హక్కుల సంఘం వారు స్పందించాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. అయితే అది వారి మతాచారం అంటున్న కారణంగా ఏం చేయలేమని ఐక్యరాజ్యసమితి కూడా అంటున్నట్లుగా తెలుస్తోంది.