సొంత కుమారుడిని వివాహమాడింది అంటూ నెటిజన్ల ట్రోల్, నిజం కాదంటున్న ట్విట్టర్ యూజర్

సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అయిపోతున్న విషయం తెలిసిందే.

 Muslim Woman From Saudi Arabia Married Her Son News Was Fake-TeluguStop.com

అయితే ఇటీవల ఈ సామాజిక మాధ్యమంలోనే ఒక విషయం పై నెటిజన్లు తెగ ట్రోల్ చేసుకుంటూ వచ్చారు.ఇంతకీ ఆ విషయం ఏమిటంటే సౌదీ అరేబియా కు చెందిన ఒక మహిళ తన భర్త చనిపోవడం తో తన సొంత కుమారుడిని వివాహమాడింది అంటూ దానికి సంబందించిన ఒక ఫోటో షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

అయితే అసలు ఆ ఫోటో వెనుక కథ ఏంటి అన్నదానిపై ట్విట్టర్ యూజర్ ఒకరు వెల్లడించారు.సామజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్న ఈ విషయంలో ఏమాత్రం నిజం లేదని, ఇస్లామిక్‌ క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ ఫొటో కోసం తాను సోషల్ మీడియాలో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ చేయగా… జనవరి 31న ఈ ఫొటోలు ఒక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినట్టు గుర్తించానన్నారు.

ఈ ఫొటోకు ఉర్దూలో “ఇవాళ నా కుమారుడు ఖురాన్ పఠనం పూర్తి చేశాడు” అని క్యాప్షన్ ఉన్నట్టు జుబీర్ వివరించారు.కానీ, ఈ ఫొటోను తీసుకుని ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా ‘సొంత కొడుకును పెళ్లాడిని తల్లి’ అంటూ దుష్ప్రచారం చేశారని జుబీర్ పేర్కొన్నారు.

మొత్తానికి సోషల్ మీడియా ఏ రేంజ్ లో తమ పని చేసుకుపోతున్నాయో ఈ విషయం తెలుస్తుంది.ఖురాన్ పఠనం పూర్తి చేసుకున్న తన కుమారుడి మెడలో దండ ఉండడం అలానే ఆమె మెడ లో కూడా దండ ఉండడం తో అందరూ ఇలా దుష్ప్రచారం చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube