‘మహాభారత్’ గీతం ఆలపించిన ముస్లిం.. నెటిజన్లు ఫిదా

భారతదేశం భిన్న మతాలు, ఆచార వ్యవహారాలకు కేరాఫ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వం కాగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, ఇతర మతాల వారు కలిసి మెలిసి భారత్‌లో ఉంటున్నారు.

 Muslim Sings Mahabharat Title Song-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకోవడం సంప్రదాయంగా ఉంది.ఈ క్రమంలోనే పాపులర్‌ టెలివిజన్‌ సీరియల్‌ ‘మహాభారత్‌’ టైటిట్‌ సాంగ్‌ను ఓ ముస్లిం అత్యద్భుతంగా ఆలపించాడు.

ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్ఛరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

 Muslim Sings Mahabharat Title Song-‘మహాభారత్’ గీతం ఆలపించిన ముస్లిం.. నెటిజన్లు ఫిదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సదరు వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌.వై.ఖురైషి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

‘బీటింగ్‌ ది స్టీరియోటైప్స్ ’ అనేక క్యాప్షన్‌తో షేర్ చేయబడిన ఈ వీడియో నెట్టింట హల్‌చల్ అవుతోంది.ఈ వీడియోను నెటిజన్లు ట్విట్టర్ , ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఇతర మాధ్యమాల వేదికగా షేర్ చేస్తూ ఇంకా ట్రెండ్ చేస్తున్నారు.ఈ వీడియో చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

‘దిస్ ఈజ్ ఇండియా, భిన్న మతాల ఆలవాలం భారత్, సెక్యులర్ ఇండియా’ అని పోస్టులు పెడుతున్నారు.మొత్తం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.ఇకపోతే హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన ‘రామాయణ, మహాభారత్’ సీరియల్స్ టెలివిజన్‌ చరిత్రలో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్, ప్రేక్షకుల ఆదరణ పొందిన సీరియల్స్‌గా రికార్డు సృష్టించిన సంగతి అందరికీ విదితమే.ఈ సీరియల్స్ ప్రసారమయ్యే టైం అయ్యిందంటే చాలు.

జనం ఎంతో ఈగర్‌గా వాటి కోసం వెయిట్ చేసి మరీ చూసేవారు.తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుండటం ద్వారా చాలా మంది మళ్లీ అలనాటి పాపులర్ సీరియల్ గురించి చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా అలానాటి పరిస్థితుల గురించి, సీరియల్ గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

#Mahabharat #Ramayanam #Hindu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు