యూరో కప్ లో మరో బాటిల్ రగడ..!

యూరో కప్ కోసం హడావుడి మొదలైంది.క్రీడాాకారులతో సమావేశాలు నిర్వహిస్తూ పబ్లిసీటి కార్యక్రమాలను మొదలెట్టేశారు.

 Muslim Player Paul Pogba Removes Wine Bottle In Press Conference , Paul Pogba, F-TeluguStop.com

ఈ యూరో కప్ పోటీలు ప్రధానంగా కొన్ని కంపెనీల సహకారంతో సాగుతుంటాయి.కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీలు తమ ప్రకటనలు చేసుకుంటూ ఉంటాయి.

కూల్ డ్రింక్సు బాటిళ్లను మీడియా సమావేశంలో క్రీడాకారుల ముందు ఉంచుతూ ఓ రకంగా పబ్లిసీటీని పెంచుకుంటూ ఉంటాయి.ఇప్పటి వరకూ వస్తున్న ప్రకారంగానే ఈసారి కూడా యూరో కప్ పోటీాలు అట్టహాసంగా మొదలు అయ్యాయి.

అయితే ఈ ఈవెంట్లలో అనుకోని సంఘటనలు జరుగుతుండటం వల్ల రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజాగా గత రెండు రోజుల క్రితం యూరో కప్ పోటీల కోసం వచ్చిన రోనాల్డో సంచలన పని చేశాడు.

మీడియా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో స్పాన్సర్స్ అయిన కంపెనీలు తమ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు చేసుకోవచ్చు.అందులో భాగంగా క్రీడాకారులు మాట్లాడుతన్నప్పుడు వారి వద్ద కూల్ డ్రింక్స్ బాటిళ్లను పెట్టారు.

రొనాల్డో తన వద్ద ఉన్న కోకోకోలా బాటిల్ ను తీసి పక్కన పెట్టేశాడు.ఆ టైంలో అందరికీ ఆశ్చర్యం వేసింది.ఇలా చేయడం వల్ల కోకోకోలా షేర్సు కూడా బాగా పడిపోయాయి.దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యింది.

ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.ఫ్రెంచ్ స్టార్ మిడ్‌ ఫీల్డర్ పాల్ పోగ్బా మీడియా సమావేశంలో ఓ చేదు ఘటన చోటుచేసుకుంది.ఈ క్రీడాకారుడు తన ముందువైపుగా హీనెకెన్ బీరు బాటిల్‌ ఉండటం గమనించాడు.దీంతో అది చూడగానే వెంటనే దానిని తీసి పారేశాడు.ఈ వీడియోను విని జానీ అనే ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.పాల్ పోగ్బా క్రీడాకారుడు ఇస్లాంను అనుసరించడం వల్ల ఆయన ముందు ఉన్న బీరు బాటిళ్లును పక్కకు తీసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube