మందిరం నిర్మాణానికి మట్టితో బయల్దేరిన ముస్లిం.. ఎందుకంటే?

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఆగస్టు 5న‌ ప్రధాని మోదీ భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఇంకా ఈ వేడుకకు ఎక్కడెక్కడ నుండో వచ్చి హాజరు కానున్నారు.

 Muslim Man, 800 Km Journey, Ram Mandir, Bhoomi Puja, Ayodhya-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఓ ముస్లిం కూడా ఈ వేడుకకు హాజరుకానున్నాడు.అతని పేరు మొహమ్మద్ ఫైజ్ ఖాన్‌.

పేరు, మతం రీత్యా ముస్లిం అయినప్పటికీ అతను శ్రీరామచంద్రుడి భ‌క్తుడు.

దీనికి కారణంగా అతడికి ఓ కవి చెప్పిన మాటే.

ఆ కవి ఎం అని చెప్పాడంటే? భారత్‌కు శ్రీరాముడే దేవుడని అతడికి చెప్పారట.ఆ కవి చెప్పిన అప్పటి నుండి అతడి మనసులో బలంగా పాతుకుపోయింది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలవుతుందనే వార్త విని అతడి ఆనందానికి హద్దులు లేవని తెలిపారు.

Telugu Km Journey, Ayodhya, Bhoomi Puja, Ram Mandir-Latest News - Telugu

ఇకపోతే శ్రీరాముడి తల్లి కౌసల్య జన్మస్థానంగా చెప్పుకునే ఛత్తీస్‌గఢ్‌లోని చంద్‌ఖురి గ్రామం నుంచి మందిరం నిర్మాణానికి మట్టి తీసుకొని కాలినడకన బయల్దేరినట్టు తెలిపారు.అక్కడి నుండి అయోధ్యకు దాదాపు 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆగస్టు 5 వరకు అయోధ్య చేరుకోనున్నట్టు ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు.

కాగా అతని కాలినడక కొత్తేమీ కాదని గతంలోనూ 1500 కి.మీ.ప్రయాణించి ఎన్నో హిందూ దేవాలయాలను దర్శించుకున్నట్లు తెలిపాడు.ఇంకా అయన మాట్లాడుతూ.”మనం మసీదుకు వెళ్లొచ్చు, చర్చికి వెళ్లొచ్చు.కానీ, భారతీయులందరం హిందూ మూలాలున్న వ్యక్తులం” అంటూ ఫైజ్ ఖాన్ చెప్తున్నాడు.ఏది ఏమైనా ఒక ముస్లిం అయోధ్య రామ మందిరంపై ఇష్టం చూపించడం మాములు విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube