అయోధ్య అంశంపై ముస్లిం లా బోర్డు సంచలనం

వివాదాస్పద అయోధ్య కేసుని సుప్రీం కోర్ట్ ఎట్టకేలకు తేల్చేసి హిందువులకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆ కేసు తీర్పు హిందువులకి సంతోషాన్ని ఇవ్వగా, ముస్లింలకి కాస్తా ఆవేదనని మిగిల్చింది.

 Muslim Law Boards Move To File Review Plea Against Ayodhya-TeluguStop.com

దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటానికి సుప్రీం కోర్ట్ తీర్పు నిజంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి.ఆ తీర్పు తర్వాత ముస్లింలు ఎలాంటి అవాంచనీయ ఘటనలకి పాల్పడకుండా శాంతియుతంగా స్పందించి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

దానిపై న్యాయస్థానం తీర్పుకి అనుకూలంగానే నడుచుకుంటామని చెబుతూనే అవసరం అయితే రివ్యూకి వెళ్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే బాబ్రీ మసీదు-రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది.

రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకుంటూ వచ్చే నెల మొదటి వారంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఇవాళ వెల్లడించింది.అయితే రివ్యూ కోరకూడదంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో కేసుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది.

మరి రివ్యూ పిటీషన్ లో ముస్లిం లా బోర్డు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube