అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకు కేటాయిస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.ముస్లీంల మసీదు కోసం అయిదు ఎకరాల భూమిని కేటాయించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కోర్టు తీర్పుపై ఇన్ని రోజులు మౌనంగా ఉంటూ వచ్చిన ముస్లీ పర్సనల్ లా బోర్డు నేడు రివ్యూ పిటీషన్ వేయాలంటూ నిర్ణయానికి వచ్చింది.పలు ముస్లీం సంఘాలు మరియు ముస్లీం పెద్దలు చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారట.
ముస్లీంలు ఈ తీర్పుపై మొదట రివ్యూ పిటీషన్ వేయాలనుకోవడం లేదు అంటూ ప్రకటించారు.కాని మత పెద్దలు కొందరు మరియు లాబోర్డులోని కొందరు తీవ్రంగా ఒత్తిడి తీసుకు వచ్చిన కారణంగా రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో ముస్లీంలు మళ్లీ రివ్యూ పిటీషన్ వేయబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.సర్వోత్తమ న్యాయం స్థానం తీర్పును మళ్లీ పున: సమీక్షించే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.