విడ్డూరం : రూ.30 అడిగినందుకు 'తలాక్‌' చెప్పిన దుష్టుడు ఆ రూ.30 ఎందుకు అడిగిందో తెలుసా?  

Muslim Husband Triple Talaq-

ముస్లీం మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య తలాక్‌.కేంద్ర ప్రభుత్వం తలాక్‌ను రద్దు చేసేందుకు సిద్దం అయ్యింది.పార్లమెంటులో బిల్లు కూడా పెట్టింది..

Muslim Husband Triple Talaq--Muslim Husband Triple Talaq-

అయితే ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.ఈ సమయంలోనే ఢిల్లీ నోయిడాలో ఒక వ్యక్తి చిన్న కారణంతో తన భార్యకు తలాక్‌ చెప్పడంతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.చిన్న చిన్న విషయాలకు తలాక్‌ చెప్పి భార్యలను వదిలించుకుంటున్నారంటూ ముంస్లీం మహిళలు ఆందోళన చేస్తున్నారు.

తాజాగా నోయిడాలోని దాద్రీ ప్రాంతంలో సబీర్‌ అనే వ్యక్తి తన భార్య జైనాబ్‌తో కలిసి ఉంటున్నాడు.గత కొన్నాళ్లుగా ఇద్దరి మద్య కూడా గొడవలు ఉంటున్నాయి.జైనాబ్‌ అన్ని విషయాలను సర్దుకుని పోతూ భర్త చెప్పిన మాట వింటూ వస్తుంది.ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని సతమతం పెట్టడం చేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సబీర్‌ను కూరగాయలు కొనేందుకు జైనాబ్‌ 30 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరింది.అప్పుడు అతడు లేవంటూ గొడవకు దిగాడు..

ఇద్దరి మద్య మాట మాట పెరిగి చివరకు సబీర్‌ ఆమెను కొట్టే వరకు పరిస్థితి వచ్చింది.జైనాబ్‌ కూడా ఎదురు తిరిగింది.తనకే ఎదురు తిరుగుతావా, తాను తెచ్చింది తినకుండా నీకంటూ నీవు నిర్ణయాలు తీసుకుంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తీవ్ర స్థాయిలో వివాదం ముదరకున్నా కూడా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పేసి ఆమెను పుట్టింటికి పంపించాడు.రెండవ పెళ్లి చేసుకుంటానంటూ చూస్తున్నాడు.దాంతో జైనాబ్‌ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది..

అయితే ముస్లీం మతాచారం ప్రకారం తలాక్‌ చెప్పడంతో విడాకులు అయ్యాయని తామేం చేయలేం అంటూ వారు చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తోంది.