హిందూ మహిళకు ముస్లిం సోదరుల అంత్యక్రియలు.. వైరస్ సోకడంతో..?

కరోనా మహమ్మారి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సోకుతూ ప్రజల్లో ఊహించని స్థాయిలో భయాందోళనను పెంచుతోంది.కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో చిన్నపిల్లలు, యువతకు పెద్దగా ప్రమాదం లేకపోయినా బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

 Muslim Brothers Held A Hindu Woman Coronavirus Patient Funeral, Corona Virus, G-TeluguStop.com

కరోనా వల్ల దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.

గుంటూరు జిల్లాలోని నండూరు గ్రామానికి చెందిన 68 సంవత్సరాల వయస్సు గల లక్ష్మీశెట్టి సామ్రాజ్యం కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు.

అయితే కరోనా వల్ల చనిపోవడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి లక్ష్మీశెట్టి బంధువులు, నండూరు గ్రామస్తులు ముందుకు రాలేదు.మహిళ దహనసంస్కారాలకు వెళితే తమకు కూడా కరోనా సోకుతుందని వాళ్లు భయాందోళనకు గురయ్యారు.

అయితే ఈ విషయం పొన్నూరు గ్రామానికి చెందిన ఆరిఫ్, ఖమ్ము, మరికొందరు ముస్లింలు కలిసి మహిళకు హిందువుల సంప్రదాయాల ప్రకారం కరోనా జాగ్రత్తలను తీసుకుంటూ అంత్యక్రియలను జరిపించారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు వాళ్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.

కరోనా కష్ట కాలంలో మానవత్వం చూపించి ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.

Telugu Corona, Guntur, Brothers, Funeral-General-Telugu

మరోవైపు ఏపీలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి.కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్నా కేసుల సంఖ్య తగ్గదం లేదు.తగ్గడం లేదు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కరోనా వైరస్ కట్టడి కోసం చర్యలు చేపడుతుండటం గమనార్హం.మరోవైపు ఏపీలో 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ ఎప్పటినుంచి మొదలవుతుందో తెలియాల్సి ఉంది.వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube