ఆదర్శం : ఈ ఆటో డ్రైవర్‌ రియల్‌ హీరో, అందరు ఇలా ఉంటే 'ఆ' గొడవలే ఉండవు  

muslim auto driver takes pregnant hindu woman to hospital -

కొన్ని సంఘటనలు చూస్తే మానవత్వం అనేది ఎప్పుడో మంట కలిసి పోయింది.జనాలు మానవత్వం అనేదాన్ని మర్చి పోయి, ఎవరికి వారు అన్నట్లుగా జీవితాన్ని గడిపేస్తున్నారు, అత్యంత దారుణమైన విషయం ఏంటీ అంటే రోడ్డు మీద చిన్న పిల్లలు, ఆడవారు కష్టంలో ఉన్నా కూడా మనకు ఎందుకులే అనుకుంటూ ఉన్నారు.

TeluguStop.com - Muslim Auto Driver Takes Pregnant Hindu Woman To Hospital

చివరకు గర్బవతి గురించి కూడా పట్టనట్లుగా జనాలు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి సమయంలో అస్సాంకు చెందిన ఒక ముస్లీం ఆటో డ్రైవర్‌ తన మానవత్వంను చాటుకున్నాడు.

మంచి చేసేందుకు ప్రాణాలు సైతం వదిలినా ఎలాంటి ఇబ్బంది లేదు అని ముందుకు సాగి కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలిచాడు.

TeluguStop.com - ఆదర్శం : ఈ ఆటో డ్రైవర్‌ రియల్‌ హీరో, అందరు ఇలా ఉంటే ఆ’ గొడవలే ఉండవు-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అస్సాం రాష్ట్రం దిస్పూర్‌లో ఇటీవల మత ఘర్షణలు జరిగాయి.

దాంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.ఎలాంటి వాహనాలు కూడా బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఎంతటి అత్యవసర పరిస్థితి అయినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని పోలీసు వారి హెచ్చరిక.అలాంటి సమయంలో దిస్పూర్‌కు చెందిన రుబెన్‌ దాస్‌ అనే వ్యక్తి భార్య నందిత పురిటి నొప్పులతో బాధ పడుతోంది.

ఆమెను పోలీసుల సాయంతో రుబెన్‌ దాస్‌ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలని ప్రయత్నించాడు.కాని అది సాధ్యం కాలేదు.

ఆ సమయంలోనే ఒక ముస్లీం ఆటో డ్రైవర్‌ మక్బుల్‌ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

నొప్పులతో బాధపడుతున్న నందితకు సాయం చేసేందుకు ముక్బుల్‌ వచ్చాడు.కర్ఫ్యూ సమయంలో ముస్లీంలు బయటకు రావడమే ఎక్కువ అంటే, నందితను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లేందుకు ముక్బుల్‌ రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు.మత ఘర్షణల మద్య ఇలాంటి మత సామరస్య పని జరిగినందుకు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముక్బుల్‌ సాయంతో నందిత హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యి మగ బిడ్డకు జన్మనిచ్చింది.కొన్ని నిమిషాలు ఆలస్యం అయితే తల్లి బిడ్డ ప్రాణాలకు అపాయం వాటిల్లేది.మత ఘర్షణల సమయంలో హిందూ కుటుంబంకు ముక్బుల్‌ చేసిన సాయంకు పోలీస్‌ డిప్యూటీ కమీషనర్‌ అభినందన వ్యక్తం చేశారు.హిందూ ముస్లీం మత సామరస్యంను చాటే ఇలాంటి సంఘటనలు ఇతరులకు కనువిప్పు అంటూ ఈ సందర్బంగా పోలీసు ఉన్నతాధికారులు అన్నారు.

పోలీసులతో పాటు పలు సంఘాల వారు మక్బుల్‌ను అభినందించారు.ఇలాంటి వ్యక్తులు ఉంటే దేశంలో మతం పేరుతో గొడవలు అనేవే జరగవు కదా.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Muslim Auto Driver Takes Pregnant Hindu Woman To Hospital Related Telugu News,Photos/Pics,Images..