పవన్ కళ్యాణ్‌కు వాయింపుడు షురూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Music Sittings Started For Pawan Kalyan Movie, Pawan Kalyan, Harish Shankar, Dev-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతున్నాడు పవన్.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను స్టార్ట్ చేసిన పవన్, ఆ తరువాత దర్శకుడు హరీష్ శంకర్, సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేశాడు.

అయితే గతంలో పవన్‌కు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గబ్బర్‌సింగ్‌ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి పవన్ కోసం మరో అద్భుతమైన కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కథతో పవన్ మరోసారి తనదైన మార్క్ వేసుకుని హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడట.కాగా ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.దీంతో ఈసారి దేవిశ్రీ పవన్ కోసం ఎలాంటి సంగీతం అందిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సిట్టింగ్‌లో పాల్గొంటున్నాడట.

గతంలో గబ్బర్‌సింగ్ వంటి మ్యూజికల్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ఈసారి అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట.

ఇక పవన్ అతి త్వరలో ఈ సినిమాను ప్రారంభించి సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈసారి పవన్ కోసం హరీష్ శంకర్ ఎలాంటి కంటెంట్‌ను పట్టుకొస్తున్నాడా అనే ఆసక్తి అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో నెలకొంది.

అయితే ఈ సినిమాలో పవన్ డ్యుయెల్ రోల్‌లో నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube